వచ్చే సంక్రాంతి పోటీ మరీ రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతికి వారం రోజుల ముందే విడుదల అవ్వబోతుంది. సంక్రాంతికి రాధే శ్యామ్.. సర్కారు వారి పాట మరియు భీమ్లా నాయక్ సినిమాలను విడుదల చేయబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ వచ్చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో సర్కారు వారి పాటను ఇప్పటికే తప్పించారు. మరో వైపు భీమ్లా నాయక్ ను కూడా రిపబ్లిక్ డే తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ఒక్క రాధే శ్యామ్ మాత్రమే సంక్రాంతి కి ఉంటుందని అనుకుంటున్న సమయంలో ఆర్ ఆర్ ఆర్ కు పోటీ అన్నట్లుగా బంగార్రాజు కూడా విడుదల అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న బంగార్రాజు సినిమాను డిసెంబర్ మొదటి వారం వరకు పూర్తి చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇంత స్పీడ్ గా చిత్రీకరణ జరుగుతుంది అంటే ఖచ్చితంగా సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలిన భావిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక వేళ భీమ్లా నాయక్ సంక్రాంతిని స్కిప్ చేస్తే ఖచ్చితంగా బంగార్రాజు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
664024 350907A truly interesting examine, I may possibly not concur totally, but you do make some extremely valid points. 64491
739491 843724Thank you for having the time to discuss this topic. I truly appreciate it. Ill stick a link of this entry in my internet site. 546489