‘‘నా తదుపరి రాజకీయ అడుగుపై బెజవాడ మొత్తం చర్చలో మునిగిపోయిన తరుణంలో నేనిలా అద్భుతమైన బంగీ జంప్ చేస్తున్నాను’’ అంటూ టీడీపీ నేత బొండా ఉమ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆయన పార్టీ మారడం ఖాయమంటూ జోరుగా జరుగుతున్న ప్రచారానికి ఈ ట్వీట్ మరింత ఆజ్యం పోసినట్టయింది. ఉమ పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. ఆయన అధికార వైఎస్సార్ సీపీ వైపు వెళ్లారని చెబుతున్నారు. ఈ మేరకు అన్ని సంప్రదింపులూ పూర్తయ్యాయని సమాచారం.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొండా బరిలోకి దిగారు. అటువైపు వైఎస్సార్ సీపీ నుంచి మల్లాది విష్ణు రంగంలో ఉన్నారు. ఇరువురు మధ్య హోరాహోరి పోరు జరగ్గా.. విష్ణు కేవలం 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనిపై ఉమ రీకౌంటింగ్ కు డిమాండ్ చేసినా ఎన్నికల అధికారి అంగీకరించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు కూడా నిర్వేదానికి గురయ్యారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత అంత క్రియాశీలకంగా వ్యవహరించలేదు.
అయితే, కాకినాడలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అది రాజకీయంగా కలకలం రేపింది. వారంతా బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. అయితే, దానిని ఖండించారు. అనంతరం విజయవాడలో కూడా కాపు సామాజికవర్గ నేతలతో భేటీ నిర్వహించారు. ఈ తరుణంలోనే ఆయన తన తదుపరి రాజకీయ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీకి భవిష్యత్తు బాగోలేనందున ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, బీజేపీలో చేరాలా, వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపాలా అనేదానిపై తర్జనభర్జనలు పడినప్పటికీ, చివరకు అధికార పార్టీవైపే వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన బొండా ఉమ.. అక్కడ బంగీ జంప్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలతోపాటు తన రాజకీయ అడుగు కూడా ఇలాగే ఉంటుందని అర్థం వచ్చే రీతిలో ట్వీట్ పెట్టడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమైనట్టు తెలుస్తోంది.
797630 912452Pretty section of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get actually enjoyed account your blog posts. Any way I will be subscribing to your augment and even I achievement you access consistently quickly. 435739
554512 676297This is a great blog. Keep up all of the function. I too really like to weblog. This really is wonderful every person sharing opinions 127839
462136 871207Hello. Cool write-up. Theres an concern with the site in internet explorer, and you may want to test this The browser could be the marketplace chief and a large element of other folks will miss your great writing due to this difficulty. 965960