Switch to English

రోహిత్, కోహ్లీ.. ఇంకా గొడవలు సద్దుమణగలే!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘‘టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. అతడు బాగా ఆడిన ప్రతిసారీ నేను ప్రశంసల్లో ముంచెత్తాను. నాలో ఏదైనా అభద్రతా భావం ఉంటే ఇలా చేస్తానా? నాకు ఎవరిపైనైనా కోపం ఉంటే అది నా మొహంలో కనిపిస్తుంది. నేను, రోహిత్ నాలుగేళ్లుగా కలిసి కష్టపడి జట్టును ఈ స్థాయికి తెచ్చాం. మేం బతికేది, శ్వాసించేది, ఏం చేసిన భారత క్రికెట్ బాగు కోసమే. మా మధ్య ఎలాంటి సమస్యా లేదు’’ – ఇదీ రోహిత్ శర్మతో విభేదాలంటూ వస్తున్న వార్తలపై భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఇచ్చిన సమాధానం.

ఇంతటి స్పష్టమైన వివరణతో ఈ వివాదం సమసిపోతుందని కొంతమంది భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు విరుద్ధంగానే కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ మధ్య గొడవలు ఇంకా సద్దుమణిగినట్టుగా కనిపించడంలేదు. ప్రస్తుతం భారత జట్టు విండీస్ టూర్ కి వెళ్లింది. ఈ నేపథ్యంలో సారథి కోహ్లీ ఓ ఫొటోను షేర్ చేశాడు. డ్రెస్సింగ్ రూంలో సహచర ఆటగాళ్లతో కలిసి విజయ సంకేతం చూపిస్తూ దిగిన ఫొటోను అతడు పోస్టు చేశాడు.

అయితే, అందులో రోహిత్ లేకపోవడంతో అభిమానులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఓపెనర్ ఎక్కడ విరాట్ అంటూ అడుగుతున్నారు. మొత్తమ్మీద ఇరువురి మధ్యా ఇంకా విభేదాలు సమసిపోలేదన్నమాట అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు రోహిత్ వైఖరి కూడా అలాగే కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం అతడు తన ఫొటోతో పాటు ‘‘జట్టు కోసం ఆడను.. దేశం కోసం బరిలోకి దిగుతా’’ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశాడు. ఇది కచ్చితంగా కోహ్లీని ఉద్దేశించి చేసిన ట్వీట్ గానే అభిమానులు భావిస్తున్నారు.

ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత తలెత్తిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ఇది జట్టు ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పలువురు ఆందోళన చెందుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

Ram Charan Birthday special: విమర్శలకు చెక్.. విమర్శకులకు సమాధానం.. రామ్ చరణ్

Ram Charan: సినిమా బాషలో ఓ మాట ఉంది. ‘విమర్శకుల మెప్పు పొందిన సినిమా.. హీరో’ అని. సినిమాలో లోపాలు, హీరో నటనపై, దర్శకుడి ప్రతిభపై విమర్శలు చేస్తూ.. ఒకరకంగా హీరో, దర్శకుడు,...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఏప్రిల్‌ 5న విడుదల...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...