సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్టణానికి మరో అరుదైన గౌరవం లభించింది. ఇక్కడి రుషికొండ బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. పర్యావరణహిత, ప్రమాదరహిత బీచ్ లకు ఇచ్చే బ్లూఫాగ్ సర్టిఫికెట్ ను రుషికొండ బీచ్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత చక్కని బీచ్ లు ఎక్కడున్నాయనే విషయాన్ని బ్లూఫాగ్ గుర్తిస్తుంది. ఈ సంస్థ గుర్తింపు పొందిన బీచ్ లకు అత్యంత ఆదరణ ఉంటుంది.
బ్లూఫాగ్ సర్టిఫికెట్ పొందాలంటే.. బీచ్ పర్యావరణహితంగా ఉండటంతోపాటు ప్రమాదరహితంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి రసాయనాలు, కాలుష్యకారకాలు అక్కడ కలవకూడదు. ఇవన్నీ బాగుంటే బ్లూఫాగ్ సంస్థ.. ఆ బీచ్ కు గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తుంది. తాజాగా బ్లూఫాగ్ ఇంటర్నేషనల్ జ్యూరీ బృందం రుషికొండ బీచ్ ని వర్చువల్ విధానంలో పరిశీలించింది.
మనదేశంలో మొత్తం 13 బీచ్ లను పరిశీలించిన ఈ బృందం.. 8 బీచ్ లు బ్లూఫాగ్ సర్టిఫికెట్ కు అర్హత పొందినట్టు వెల్లడించింది. ఇందులో విశాఖలోని రుషికొండ బీచ్ తోపాటు ఒడిశాలోని గోల్డెన్ బీచ్, అండమాన్ లోని రాధానగర్ బీచ్, కేరళలోని కప్పడ్ బీచ్, కర్ణాటకలోని పదుబిద్రి బీచ్, కాసర్ కోడ్ బీచ్, డయ్యూలోని ఘోగ్లా బీచ్, గుజరాత్ లోని శివరాజ్ పూర్ బీచ్ ఉన్నాయి. ఆయా బీచ్ లు మంచి ప్రమాణాలతో ఉన్నాయని బృందం ప్రశంసించింది.
అలాగే తీర ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు భారత్ తీసుకుంటున్నవిధానాలు బాగున్నాయని పేర్కొంది. బెస్ట్ ప్రాక్టీస్ లో భారతదేశం 3వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది.
616308 877432This web site is usually a walk-through you discover the details it suited you about this and didnt know who require to. Glimpse here, and youll undoubtedly discover it. 199051
256421 826294I undoubtedly did not realize that. Learnt something new nowadays! Thanks for that. 170587