తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 520 రోజుల్లో కుటుంబ పాలన నుండి విముక్తి లభించబోతుంది. ప్రస్తుత తెలంగాణ సర్కార్ కు కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం అంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ అన్నారు. ఈనెల 3వ తారీకున విజయ సంకల్ప సభ హైదరాబాద్ లో జరుగబోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి అవినీతి పాలన.. కుటుంబ పాలన తప్పబోతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యమంలో లేని వారు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారంటూ కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి ఆయన ఆరోపించారు. మోడీ పై ప్రజల్లో ఉన్న నమ్మకం తో వచ్చే ఎన్నికల తర్వాత అధికార మార్పు ఖయాం అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.