అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ వర్గాల వారు మరియు మీడియా వారు అంతా కూడా ప్రస్తుతం పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసిన విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన పుష్ప సినిమా కు సీక్వెల్ అన్నట్లుగా పుష్ప 2 సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తుది దశకు వచ్చింది. అతి త్వరలోను పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు గాను అంతా సిద్ధం అన్నట్లుగా ఉంది.
పుష్ప సినిమా లో నటించేందుకు నటీ నటులు కావాలంటూ చిత్ర యూనిట్ సభ్యులు కాస్టింగ్ కాల్ ఇచ్చింది. అయితే చిత్తూరు యాస తెలిసిన చిత్తూరు వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా వారు ప్రకటించారు. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా సాగుతున్నట్లుగా చూపించబోతున్నారు. సినిమా మొదటి పార్ట్ కు చిత్తూరు యాస బాగా కలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ అదే మార్క్ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాస్టింగ్ కాల్ ద్వారా పలువురు నటీ నటులను తీసుకోబోతున్నారట.