షాక్! బిగ్ బాస్ హోస్ట్ గా జేజమ్మ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,603FansLike
57,764FollowersFollow

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 కోసం కసరత్తులు జోరుగా జరుగుతున్నాయి. జూన్ లో ఈ మూడో సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తవుతున్న ఈ సీజన్ కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేసి ఆ సీజన్ ను సూపర్ సక్సెస్ చేసాడు. ఆ తరువాత రెండో సీజన్ కు అయన నో చెప్పడంతో అయన ప్లేస్ లో నాచురల్ స్టార్ నానిని దింపారు. అయితే రెండో సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పాటు పలు వివాదాలు చెలరేగాయి. దాంతో ఇప్పుడు మొదలయ్యే మూడో సీజన్ కు ఎవరు హోస్ట్ అన్న విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగార్జున తో చర్చలు జరిపారట, కానీ నాగ్ ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.

మరో వైపు టాలీవుడ్ సంచలన స్టార్ విజయ్ దేవరకొండతో కూడా చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేశారట, కానీ విజయ్ అప్పుడే టివి షోస్ లో నటించేంది లేదని చెప్పడంతో, మరి ఎవరిని అడగాలి అన్న సంకోచంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్కని అడిగారట. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో ఏ భాషలో అయినా మగవాళ్ళతోనే హోస్ట్ గా చేయించారు .. కానీ మొదటి సారి తెలుగులో ఎందుకు హీరోయిన్ తో హోస్టింగ్ చేయించకూడదు అన్న ఆలోచనతో అనుష్కను సంప్రదిస్తే ఆమెకూడా అంగీకరించినట్టు తెలుస్తోంది?

బాగమతి తరువాత అనుష్క సన్నబడేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఏడాది కాలంగా ఆమె ఏ సినిమా కు సంతకం చేయలేదు. తాజాగా ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్టు సమాచారం. అయితే ఇన్నాళ్లు ప్రేక్షకులకు దూరంగా ఉంది కాబట్టి .. ఇలా బుల్లితెరపైన కనిపిస్తే ప్రేక్షకులకు ఇంకా దగ్గర కావొచ్చన్నది మన జేజమ్మ ఆలోచన. అందుకే ఈ షో కి ఒప్పుకుందేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి గ్లామర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై సత్తా చాటి హీరోలకు ధీటుగా ఇమేజ్ తెచ్చుకుంది.

4 COMMENTS

సినిమా

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

Daily Horoscope: సింహకు కొత్త అవకాశాలు.. ధనుస్సుకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు

మే 17 , 2026 ఆదివారం రాశిఫలాలు: ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం,...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల కాబోయే ట్రైలర్ గురించి బయటకు వస్తున్న...

సింగపూర్‌తో ఏపీకి కొత్త వాణిజ్య కారిడార్?.. లోకేష్ కీలక ప్రతిపాదనలు

సింగపూర్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో గ్లోరియా ఊతో ఆయన...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...