అక్కినేని హీరో అఖిల్ నటించే నాలుగో సినిమా సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తీ కావొచ్చాయి. ఈ నెలాఖరున లాంఛనంగా ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై అందరి దృష్టి నెలకొంది. అఖిల్ సరసన బాలీవుడ్ భామ ఖైరా అద్వానీ హీరోయిన్ గా ఎంపికయిందట.
అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి ఆయనకు సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయం అయిన అఖిల్, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాగా వచ్చిన హలో, తొలిప్రేమ ఫేమ్ వెంకట్ అట్లూరి దర్శకత్వంలో మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను సినిమాలు యావరేజ్ గా నిలవడంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోలేదు. అందుకే ఈ సారి టాలీవుడ్ కు బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన భాస్కర్ ని రంగంలోకి దింపారు.
బొమ్మరిల్లు తరువాత భాస్కర్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత తమిళంలో బెంగుళూర్ డేస్ అంటూ ఓ కొత్త ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది. దాంతో ప్రయత్నాలు ఎన్ని చేసిన భాస్కర్ కు సినిమాలు మాత్రం రాలేదు. చాలా గ్యాప్ తరువాత అయన అఖిల్ కి కథ చెప్పాడట. ఆయన చెప్పిన కథ నచ్చడంతో అఖిల్ ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు టాక్. మరి అఖిల్ ని హీరోగా నిలబెట్టే బాధ్యతను ఇప్పుడు భాస్కర్ తీసుకున్నాడు. మరి అయన ప్రయత్నం అయిన వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
