కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు దసరాకు విడుదల అవుతాయని చాలా మంది ఆశించారు. కాని దసరాకు అసలు థియేటర్లే సరిగా ఓపెన్ అవ్వలేదు. సరే క్రిస్మస్ నుండి అయినా పూర్తి స్థాయిలో సినిమాలు విడుదల అవుతాయి అంటే చిన్న సినిమాలు మినహా పెద్ద సినిమాలు ఏ ఒక్కటి కూడా విడుదలకు ఆసక్తి చూపించడం లేదు. క్రిస్మస్ కు ధైర్యం చేసి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సోబెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక సంక్రాంతి సినిమాల విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది.
ఈ సంక్రాంతికి ఒక్క సినిమా కూడా ఉంటుందా లేదా అనుకుంటున్న సమయంలో రవితేజ నటించిన క్రాక్ సినిమాను జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అంటున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతికి నాలుగు అయిదు సినిమాలు వస్తాయి. కాని ఈసారి మాత్రం క్రాక్ మినహా మరే సినిమాలు కూడా వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించిన విషయం తెల్సిందే. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పెద్ద సినిమాల విడుదల అంటే సాహసమే అంటున్నారు. థమన్ అధికారికంగా సినిమాను ఈనెల 14న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ట్రైలర్ అతి త్వరలో రాబోతుంది అంటూ థమన్ అనౌన్స్ చేశాడు.
645298 851625Sweet internet website , super style and design , rattling clean and utilize genial . 288144
878302 619460Some really marvellous work on behalf of the owner of this internet website , perfectly fantastic content . 68285
857947 839583I also recommend HubPages itself, and Squidoo, which is related. 674209