కరోనా సెగ బ్రెవరేజ్ దిగ్గజం ‘కోకాకోలా’ను కూడా తాకింది. ఆర్దిక సంక్షోభం, రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన 86,200 మంది ఉద్యోగుల్లో 2,200 మందిని అమ్మకాలు తగ్గడం, మూడు శాతం మేర స్టాక్స్ తగ్గడం, మూడో త్రైమాసికంలో కోకాకోలా నికర అమ్మకాలు 9 శాతం మేర తగ్గడంతో ఈ చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోనే 1,200 మంది ఉద్యోగులను తొలగిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ఈ చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది.
ఇప్పటికే కోకాకోలా తన ట్యాబ్, ఓఢ్వాల్లా బ్రాండ్ ఉత్పత్తులను నిలిపివేసింది. కరోనా సంక్షోభం కారణంగా ఆగస్టులోనే అమెరికా, కెనడా, ప్యూర్టారికో దేశాల్లో వాలంటరీ లే ఆఫ్ ప్యాకేజీని ప్రకటించింది కూడా. ఇందుకు మొత్తంగా 350 నుండి 550 మిలియన్ డాలర్ల మేరకు కోకాకోలా ఖర్చు చేయనుందని తెలుస్తోంది. కోకాకోలాకు 230 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగి ఉంది. ఈ చర్యలు ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
552146 120035Wohh exactly what I was looking for, appreciate it for posting . 273291