అమెరికాలో మంచు అనేది సర్వ సాదారణం. కాని ఈసారి మంచు కాస్త అధికంగా ఉన్నట్లుగా అనిపిస్తుందని స్థానికులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి కంటే అధికంగా మంచు కురుస్తుందని వాతావరణ నిపుణులు సైతం చెబుతున్నారు. అమెరికాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచుతో కప్పేసినట్లుగా ఉంది. అగ్రరాజ్యం మొత్తం కూడా తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ఉంది. వాషింగ్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా ఇంకా ముఖ్య పట్టణాలు అన్ని కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి.
రోడ్లపై దట్టంగా పేరుకు పోయిన మంచును తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోట్లపై 50 నుండి 75 సెంటిమీటర్ల మేరకు మంచి ఉందని స్థానికులు అంటున్నారు. మంచు తుఫాన్ లు కూడా వస్తున్న నేపథ్యంలో తప్పనిసరి అయితే తప్ప అమెరికన్స్ బయటకు వెళ్లవద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువ మంది ప్రయాణించే రహదారులను వెంట వెంటనే క్లీన్ చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. చెట్లు రోడ్లు ఇళ్లు ఇలా అన్ని కూడా తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లుగా చూడ్డానికి అందంగా ఉన్నాయి.
929285 829115Id want to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make folks feel. Also, appreciate your allowing me to comment! 60823