తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్ విషయంలో మొదటి రెండు మూడు వారాలు మినహా ఎప్పుడు నిరాశ పర్చుతూనే వచ్చింది. మద్యలో కొన్ని వీకెండ్ ఎపిసోడ్ లు ఆకట్టుకున్నాయి. వాటికి కాస్త రేటింగ్ ఎక్కువ వచ్చింది. ముఖ్యంగా సమంత వచ్చిన ఎపిసోడ్ కు రేటింగ్ బాగానే వచ్చింది. ఇక సీజన్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రేటింగ్ మరింత తగ్గింది. మొన్నటి 14వ వారాంతం ఎపిసోడ్ లకు రేటింగ్ తక్కువగానే నమోదు అయినట్లుగా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
శనివారం ఎపిసోడ్కు 6.07, ఆదివారం ఎపిసోడ్ కు 7.63 టీఆర్పీ రేటింగ్ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ఇక గత వీక్ డేస్ లో ఓవరాల్గా 4.2 రేటింగ్ మాత్రమే నమోదు అయ్యింది. 14 వారం వీక్ డేస్ మరియు వీకెండ్స్ రేటింగ్ చాలా తక్కువగా వచ్చింది. ఇక ప్రస్తుతం చివరి వారం సాగుతోంది. ఈ వారం లో కూడా రేటింగ్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి వ్యక్తం అవుతుంది. ఆది వారం నాడు ఈ షో పూర్తి అవ్వబోతుంది. కనుక ఆ ఎపిసోడ్ కు బాగానే రేటింగ్ వచ్చే అవకాశం ఉంది. కాని ఈ వీక్ లో పెద్దగా హడావుడి ఏమీ లేదు కనుక రేటింగ్ వీక్ డేస్ కు తక్కువే నమోదు అయ్యే అవకాశం ఉంది.
564492 637064I likewise believe thus, perfectly pent post! . 62753
197594 829949It can be difficult to write about this topic. I think you did a fantastic job though! Thanks for this! 317226