నితిన్ గత కొన్నేళ్ల నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తను నటించిన రీసెంట్ సినిమాలు మూడూ కూడా ప్లాపులుగా మిగిలాయి. దాంతో ఏడాదికి పైగా ఖాళీగా గడిపేశాడు. అయితే 2020లో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ముందుగా వస్తున్న చిత్రం భీష్మ. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈరోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను కూడా కొద్దిసేపటి క్రితం వదిలారు. మొదట టీజర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న భీష్మ ఇప్పుడు ట్రైలర్ తో కూడా సూపర్ హిట్ అన్న భావన కలిగించడం విశేషం.
టీజర్ లో ఎక్కువగా కామెడీ యాంగిల్ చూపిస్తే ఇందులో మాత్రం కథ చెప్పే ప్రయత్నం చేసారు. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ హెడ్ అయిన నితిన్ కు విలన్ తో కార్పొరేట్ యుద్ధం మొదలవుతుంది. నితిన్ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేవాడైతే, విలన్ ఏమో రసాయనాలతో పంటను త్వరగా చేజిక్కించుకోవాలని ఆరాటం ఉన్నవాడు. మరి వీళ్లిద్దరి మధ్య పోరాటం ఎలా ముగిసింది అన్నది కథ.
అయితే ఈ సీరియస్ సబ్జెక్ట్ ను దర్శకుడు వెంకీ కుడుముల ఎంటర్టైన్మెంట్ అనే పూత పూసి రూపొందించాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. చూస్తుంటే భీష్మ ద్వారా నితిన్ హిట్ అందుకునేలానే ఉన్నాడు.
738532 979007Nice read. I just passed this onto a buddy who was doing some research on that. He just bought me lunch since I identified it for him! Thus let me rephrase: Thanx for lunch! 218575
52989 187371This web-site can be a walk-through rather than the data you wished about it and didnt know who need to. Glimpse here, and youll surely discover it. 64026
139716 961239I visited a lot of internet site but I conceive this 1 contains something unique in it in it 813482