నందమూరి బాలకృష్ణ కెరీర్లో ‘సింహా ‘, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్యతో మూడవ సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా పలు కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా నేటి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ రోజు నుంచీ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక స్పెషల్ సెట్లో షూటింగ్ మొదలు కానుంది. మొదాలు పెట్టడమే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ తో రౌడీలకు దబిడి దిబిడే అనే రేంజ్ లో బాలయ్య యాక్షన్ చేయబోతున్నారట. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు.
అందులో ఒకటి బాలయ్య ఇప్పటి వరకూ చేయని అఘోరా పాత్ర చేయనుండడం విశేషం. ఇప్పటికే బాలయ్య సరసన అంజలిని హీరోయిన్ గా ఖరారు చేయగా మరో హీరోయిన్ కోసం శ్రియని సంప్రదిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ ని మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు.
466614 86384hi was just seeing in case you minded a comment. i like your site and the thme you picked is awesome. I will be back. 51375
74763 899051Very nicely written story. It will be valuable to anyone who usess it, including yours truly . Maintain up the good function – canr wait to read more posts. 57284