Switch to English

వైకాపాకు సిఏఏ సెగ.. జగన్ అలా చేయగలుగుతాడా?

ప్రపంచాన్ని కరోనా కుదిపేస్తుంటే ఇండియాను సిఏఏ కుదిపేస్తోంది. సిఏఏ నిరసనల వలన దేశంలో పాలన సరిగా జరగడం లేదు. సిఏఏ వలన ముస్లిం మైనారిటీలకు ఇబ్బందులు వస్తాయని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి అన్ని అపోహలే అని, సిఏఏ వలన ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని కేంద్రం చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ముఖ్యంగా మైనారిటీ పార్టీలు ఈ విషయంలో రచ్చ చేస్తున్నాయి. సభలు నిర్వహించి ప్రజల్లో లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నిరసనల వలన ఢిల్లీలో ఎలాంటి అల్లర్లు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. చట్టాన్ని సరిగా అర్ధం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి కొన్ని పార్టీలు. అయితే, ఇప్పుడు ఆ సెగ వైకాపా పార్టీకి కూడా తగిలినట్టుగా కనిపిస్తోంది.

నిన్నటి రోజున గుంటూరు నగరంలో సింహగర్జన పేరుతో ఓ సభ జరిగింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సిఏఏ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా పోరాడాలని ముస్లిం నేతలు చెప్పుకొచ్చారు. ఈ సభలో వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా, ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాలు పాల్గొన్నారు. సిఏఏ కు వ్యతిరేకంగా వైకాపా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని, వీటిని ఏపీలో అమలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు.

జగన్ పై ఒత్తిడి తీసుకొస్తామని, అమలు జరగకుండా చూస్తామని అన్నారు. ఒకవేళ జగన్ తీర్మానానికి వ్యతిరేకంగా ఉంటె, పార్టీకి రాజీనామా చేస్తామని, తమకు పార్టీలు, పదవులు ముఖ్యం కాదని ప్రజలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో జగన్ ఆలోచన ఎలా ఉన్నదో చూడాలి. ఇప్పుడిప్పుడే జగన్ కేంద్రానికి దగ్గర అవుతున్నాడు. ఈ సమయంలో వీటిని వ్యతిరేకించి కేంద్రంతో తగువు పెట్టుకుంటాడా? చూడాలి.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

శానిటైజ్ చేసేప్పుడు ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇలానే పేలిపోద్ది.!

జాగ్రత్త సుమీ: వెహికల్ శానిటైజేషన్ అనేది తప్పనిసరి అయిన ఈ కరోనా టైంలో బైక్ ఇంజిన్ ఆన్ లో ఉండగా శానిటైజ్ చేయించవద్దు. అలా చేస్తే ఇలానే మంటలు చెలరేగి ప్రాణాలు పోగొట్టుకునే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో, రారో అనే అనుమానాలు రోజురోజుకీ పెరుగుతూనే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...