Switch to English

Bala Krishna Birthday specials: తెరపై అణు విస్ఫోటనం.. బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమాలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణకు అభిమానులు పెట్టుకున్న పేరు యువరత్న. అదే ట్యాగ్ తో ఆయన చాలా ఏళ్లు ట్రావెల్ చేశారు కూడా. అయితే.. బాలకృష్ణను కొన్నేళ్లుగా నటసింహం అని పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. కారణం.. ఆయనలోని నటనా సామర్ధ్యాన్ని తెరపై సరికొత్తగా ఆవిష్కరించడమే. దీనికి ఆద్యుడు మాత్రం ఖచ్చితంగా దర్శకుడు బోయపాటి శ్రీను అనేది వాస్తవం. 2010లో వచ్చిన సింహ సినిమాతో బాలకృష్ణ మేకోవర్, నటన, స్టయిల్ అన్నీ మారిపోయాయి. బాలకృష్ణను ఏ దర్శకుడు ఎలా చూపినా.. బోయపాటి స్టయిలే వేరు. వారిద్దరి కాంబోలో వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు రావడం గొప్ప విషయం. ఇందుకు బాలకృష్ణ-బోయపాటి శ్రీను మధ్య ఉన్న మంచి రిలేషన్, అవగాహన, బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలను బోయపాటి డిజైన్ చేయడం కారణం.

సరికొత్తగా బాలకృష్ణ మేకోవర్..

బాలకృష్ణ కెరీర్లో సింహ ఓ సంచలనం. చూడూ.. ఒకవైపే చూడు అనే డైలాగ్ పేలిపోయింది. లెక్చరర్, డాక్టర్ క్యారెక్టర్లలో అంతకుముందు మరే దర్శకుడు చూపని విధంగా బాలకృష్ణను బోయపాటి సరికొత్తగా చూపి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గంభీరం, హావభావాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి తనలోని నటుడ్ని మరోసారి పరిచయం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత 5ఏళ్లకు వచ్చిన లెజెండ్ ఏకంగా సింహను మించి విజయం సాధించింది. ఈసారి కూడా బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ ఆధారంగా కథ రాసుకుని తెరపై అంతే గంభీరంగా చూపించాడు దర్శకుడు. కథా ప్రాధాన్యాన్ని మర్చిపోక బోయపాటి తీసుకున్న జాగ్రత్తలే సింహాను మించి లెజెండ్ ఘన విజయానికి కారణమైంది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ముచ్చటగా వచ్చిన మూడో సినిమా అఖండ.

సరికొత్త పాత్రలో బాలకృష్ణ..

లెజండ్ వచ్చిన ఆరేళ్లకు వచ్చిన అఖండలో అఘోరాగా బాలకృష్ణ నట విశ్వరూపం చూపారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు అమితాశ్చర్యం పొందారు. కథ, కథనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు బోయపాటి. అఘోరాగా బాలకృష్ణ సరికొత్త పాత్రలో ఇమిడిపోయారు.. అనేకంటే ఆ పాత్రలో ఒదిగిపోయారని చెప్పాలి. దీంతో కరోనా పరిస్థితుల తర్వాత తెలుగులో నమోదైన తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా అఖండ నిలిచింది. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బాలకృష్ణకు అచ్చొచ్చిన దర్శకులుగా పేరొందిన కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరనన బోయపాటి శ్రీను ఆ ఘనతను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణకు సరికొత్త ఇమేజ్ ఇవ్వడమే కాదు.. బాలకృష్ణ నటనను మరో మలుపు తిప్పారు బోయపాటి శ్రీను. అందుకే వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఓ క్రేజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...