Switch to English

Baby Movie Review: బేబీ మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,836FansLike
57,764FollowersFollow
Movie బేబీ
Star Cast ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య
Director సాయి రాజేష్
Producer ఎస్.కె.ఎన్
Music విజయ్ బుల్గానిన్
Run Time 2గం 51ని
Release 14 జూలై, 2023

Baby Movie Review: ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం బేబీ. ఈ సినిమా ప్రోమోలతోనే విశేషంగా ఆకర్షించింది. ఒక హృద్యమైన ప్రేమకథ చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగించింది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఆనంద్, వైష్ణవి పదో తరగతి నుండి ప్రేమలో ఉంటారు. ఆ తర్వాత ఆనంద్ ఆటో డ్రైవర్ గా సెటిల్ అయితే, వైష్ణవి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ సంపాదిస్తుంది. అక్కడ తనకి విరాజ్ తో పరిచయమవుతుంది. విరాజ్, వైష్ణవితో ప్రేమలో పడతాడు.

ఈ సందర్భంలో ఒకానొక రోజు ఆనంద్, వైష్ణవికి పెద్ద గొడవ అవుతుంది. ఈ గొడవ వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది. ఎలా వీరి కథలకు ముగింపు దొరికింది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

ఆనంద్ దేవరకొండలో ప్రతీ సినిమాకూ ఎదుగుతున్న నటుడ్ని చూస్తాం. బేబీలో పూర్తి స్థాయి మ్యాచుర్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు అతను. ముఖ్యంగా సెకండ్ హాఫ్, ప్రీక్లైమాక్స్ లో ఆనంద్ దేవరకొండ నటన గుండెల్ని మెలిపెడుతుంది. మొత్తంగా ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

డెబ్యూ చిత్రం అయినా కానీ వైష్ణవి చైతన్య సూపర్బ్ గా పెర్ఫర్మ్ చేసింది. ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్ తనదే. చాలా మంది హీరోయిన్లకు దక్కని అవకాశం వైష్ణవికి తొలి చిత్రంతోనే దక్కింది. విరాజ్ అశ్విన్ కూడా బాగానే పెర్ఫర్మ్ చేసాడు. అయితే తన పాత్ర తీరుతెన్ను సరిగ్గా అనిపించదు. ముగించిన విధానం కూడా అంతలా ఆకట్టుకోదు.

సాంకేతిక వర్గం:

సంగీత దర్శకుడు విజయ్ అద్భుతమైన ఔట్పుట్ ఇచ్చాడు. సాంగ్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ సింప్లి సూపర్బ్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఇక రచయిత, దర్శకుడు సాయి రాజేష్ విషయానికొస్తే ఒక సింపుల్ కథను డీల్ చేసిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఫస్ట్ హాఫ్ అంతా నీట్ గా ప్రెజంట్ చేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ బాగా పడిపోతుంది. కానీ మళ్ళీ ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చిత్రానికి ప్రాణంలా నిలుస్తాయి.

ప్లస్ పాయింట్స్:

  • పెర్ఫార్మన్సెస్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • సెకండ్ హాఫ్
  • క్లైమాక్స్

విశ్లేషణ:

నిజ జీవితానికి అతి దగ్గరగా తెరకెక్కిన తెరకెక్కిన చిత్రం బేబీ. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ను పక్కనపెడితే బేబీలో ఎంచుకోదగ్గ పెద్ద మైనస్ పాయింట్స్ లేవు. ఇక ఈ చిత్రంలోని ఎమోషనల్ కంటెంట్ ను హ్యాండిల్ చేయగలిగితే బేబీ కచ్చితంగా నచ్చుతుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

సినిమా

తెలుగు ఇండస్ట్రీ నా ఇల్లు.. నితిన్ తో నాది హిట్ పెయిర్...

నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన...

లుక్కు అదిరింది దేవర..!

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మొదటి భాగం సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ...

సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలు..

స్టార్ యాక్టర్ సోనూసూద్ భార్య యాక్సిడెంట్ లో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సోనూసూద్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కుటంబ...

షష్టిపూర్తి సినిమాలో కీరవాణి రాసిన పాట.. విడుదల చేసిన దేవి శ్రీ..

దిగ్గజ సంగీత దర్శకులు ఒక పాట కోసం కలిశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో అయిన ఇళయరాజా సంగీతంలో ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి ఓ పాటను రాశారు....

Ram Charan birthday special: ‘మా హీరో అంతే..’ రామ్ చరణ్...

Ram Charan: సినిమా హీరోలకు అభిమానులు ఉండటం సహజం. తమ అభిమాన హీరోను ఆరాధించే క్రమంలో సినిమా రిలీజ్ కు హంగామా చేస్తారు.. కటౌట్లకు పాలాభిషేకాలు.....

రాజకీయం

సిస్కో మీటింగ్ లో రవీంద్రా రెడ్డి.. నారా లోకేష్ ఫైర్..!

ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య నేడు ఎంవోయూ జరిగింది. ఐతే ఈ మీటింగ్ లో సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఇప్పాల...

పోలీసులతో క్షమాపణ చెప్పించడమేంటి జగన్.?

పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమ పార్టీ సానుభూతి పరుడికి చిత్రమైన రీతిలో అభయమిచ్చారు. అదేంటంటే, వైసీపీ అధికారంలోకి రాగానే, ‘డీఎస్‌పీతో, క్షమాపణ’ చెప్పించడం. అంత పెద్ద నేరం ఆ...

‘తమిళ – హిందీ’ రగడపై పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా.!

తమిళ మీడియాతో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలోనూ మాట్లాడారు, ఇప్పుడు ఇంకోసారి మాట్లాడారు. అయినా, తమిళ మీడియాకి ఎందుకు పవన్ కళ్యాణ్...

వైఎస్ జగన్.. అదే స్క్రిప్ట్: మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే.!

ఒకే స్క్రిప్టుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చదువుతూ వుంటారు.! స్క్రిప్టు రైటర్లు కొత్తగా రాయడంలేదా.? కొత్తగా రాసిన స్క్రిప్టుని చదివి, అర్థం చేసుకుని, దాన్ని మీడియా మైకుల ముందు యధాతథంగా చెప్పలేని...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా ఇరికించేసిన విడదల రజనీ.!

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ మీద ఇటీవల ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అరెస్టుకి తాను భయపడేది లేదంటూ...

ఎక్కువ చదివినవి

వేదిక హాట్ ఫోజులు.. చూస్తే అంతే సంగతులు..

ఈ నడుమ సోషల్ మీడియాలో బాగా రెచ్చిపోతోంది వేదిక. ఆమె నాజూకు అందాలను చూసి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోతున్నారు. గతంతో పోలిస్తే ఆమె రచ్చ మామూలుగా ఉండట్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో...

బెట్టింగ్ యాప్స్.! ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకే కోట్లు చెల్లించారా.?

బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దయెత్తున సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ.....

బ్లాక్ డ్రెస్ లో ‘బేబీ’ అదుర్స్..!

బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమాతో రాబోతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న జాక్ సినిమాపై వైష్ణవి చైతన్య చాలా...

కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ ప్రకంపనలు..

కర్ణాటక రాజకీయాలను హనీట్రాప్ ఆరోపణలు కుదిపేస్తున్నాయి. కేవలం అధికార పార్టీనే కాకుండా అటు ప్రతిపక్ష పార్టీల లీడర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం కర్ణాటక సహకార మంత్రి రాజన్న అసెంబ్లీ సాక్షిగా...

అన్య మతస్తులైన కిరాయి మూకల్ని జనసేనపైకి ప్రయోగిస్తున్నదెవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సనాతన ధర్మ పరిరక్షణ’ కోసం నడుం బిగించడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే, హిందువునైన తాను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతోపాటు, ఇతర మతాల్ని గౌరవించడం.. అని...