ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధించడం, పురిట్లోని బిడ్డనే వదిలేయడం.. ఇంతకంటే ఘోరమైనవే జరుగుతున్న రోజులివి. ఈ తరుణంలో ఆడపిల్ల పుట్టిందనో.. పోషించలేమనో కానీ.. 21 రోజుల పసికందును భారతంలో కర్ణుడిని కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలినట్టు గంగానదిలో వదిలేసారు. చిన్నారి ఉన్న ఓ చెక్కపెట్టె నదిలో కొట్టుకురావడం ఓ బోటు నడిపే వ్యక్తి కంటపడింది. పెట్టె తెరిచి చూస్తే చంటిబిడ్డ. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఆ చంటిబిడ్డను పోలీసులు అనాధ శరణాలయానికి చేర్చారు. వివరాల్లోకి వెళ్తే..
ఘాజీపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గంగానది దాద్రి ఘాట్ వద్ద ఓ బోటు నడిపే వ్యక్తికి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. చుట్టూ ఎక్కడా మనుషులే లేరు.. చంటి బిడ్డ ఏడుపు ఎక్కడిదా ని చూసిన అతనికి నదిలో వెళ్తున్న పెట్టెలో నుంచి ఏడుపు వస్తున్నట్టు పసిగట్టాడు. దీంతో ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చాడు. తెరిచి చూస్తే… తన కళ్లను తానే నమ్మలేనట్టుగా అందులో ఓ చంటిబిడ్డ ఉంది. పెట్టెలో కనకదుర్గమ్మ ఫొటో ఉంది. పాప జాతకం ఉన్న కాగితం ఉంది. అందులో పాపకు జాతక ప్రకారం ‘గంగ’ అని పేరు పెట్టినట్టు.. అదే పేరుతో పిలవాలని రాసుంది. దీంతో గంగమ్మే తనకు బిడ్డను ప్రసాదించిందని ఆ వ్యక్తి ఆనందంలో తేలిపోయాడు. ఆ బిడ్డను పెంచుకుంటానని గ్రామంలోని తన ఇంటికి తీసుకొచ్చాడు.
విషయం సంచలనం కావడంతో పోలీసులకు తెలిసింది. గ్రామంలోని బోటు నడిపే వ్యక్తి ఇంటికి చేరుకున్న పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకునేందుకు వీల్లేదనిన్నారు. దీంతో పసిబిడ్డను ఆశాజ్యోతి కేంద్ర అనాధ శరణాలయంలో చేర్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బిడ్డ ఉన్న చెక్కపెట్టె కొత్తదిగా గమనించారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంది. దీంతో ఎవరో కావాలనే ఇలా చేశారని ప్రాధమికంగా తేల్చారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా సంచలనం రేపుతోంది.
437197 674604quite very good post, i undoubtedly truly like this exceptional internet site, continue it 822171
449465 581475Hello there, just became alert to your blog through Google, and identified that it is really informative. Im gonna watch out for brussels. Ill be grateful in case you continue this in future. Numerous men and women will likely be benefited from your writing. Cheers! 947465
536775 15551I visited a great deal of site but I conceive this one contains something special in it in it 559114
911683 76839The the next time I just read a blog, I really hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I truly thought youd have some thing intriguing to say. All I hear is generally a couple of whining about something that you could fix when you werent too busy looking for attention. 747590
649015 391517Yay google is my king aided me to uncover this great site ! . 569131