Switch to English

ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను నియమించే అవకాశం ఉందని సమాచారం. ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేనిని స్పీకర్ గా చేస్తే బావుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జగన్ ను తమ్మినేని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శుక్రవారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మామూలుగా బయటకు వచ్చేశారు. ఈలోగా లోపల నుంచి పిలుపు రావడంతో తిరిగి లోనికి వెళ్లి జగన్ తో మాట్లాడారు. ఈ సందర్భంగానే తమ్మినేనికి స్పీకర్ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. శాసనసభను నడపే వ్యక్తికి ఎంతో అనుభవం ఉండాల్సిన అవసరం ఉన్నందున, ఈ పదవికి తమ్మినేనిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

కళింగ (బీసీ) సామాజికవర్గానికి చెందిన సీతారాంను శాసనససభ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడం ద్వారా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా అవుతుందని జగన్ భావిస్తున్నారు. 1983లో తొలిసారి ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తమ్మినేని.. తాజాగా ఆరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1985లో ప్రభుత్వ విప్ గా, 1994లో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ మంత్రిగా పనిచేశారు.

ఇప్పటివరకు స్పీకర్ రేసులో ఆనం రామనారాయణరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆర్కే రోజా, అంబటి రాంబాబు పేర్లు కూడా ప్రచారంలో వచ్చినప్పటికీ, తమ్మినేని అనుభవం కలిగిన నాయకుడు కావడం.. అన్ని విషయాల్లో అవగాహన కలిగిన వ్యక్తి కావడం వంటి అంశాలు ఆయన వైపే మొగ్గు చూపేలా చేశాయని తెలుస్తోంది.

అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్పీకర్ పదవి చాలా ఉన్నతమైనది అయినప్పటికీ.. దానిని తీసుకోవడానికి చాలామంది విముఖత వ్యక్తంచేస్తుంటారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి తదుపరి ఎన్నికల్లో ఓడిపోవడమే ఇందుకు కారణం. దీంతో ఈ సెంటిమెంట్ కారణంగా పలువురు నేతలు స్పీకర్ పదవి తీసుకోవడానికి భయపడుతుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లో స్పీకర్ గా పనిచేసిన మధుసూదనాచారి, కోడెల ప్రసాదరావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. గతంలో కూడా ఇలాంటి దుష్టాంతాలు ఉండటంతో ఆ పదవి చేపట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తమ్మినేని స్పీకర్ పదవి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే, ఆయన ఈ అత్యున్నత పదవి చేపట్టడానికి పూర్తి సానుకూలంగా ఉన్నట్టు సమాచారం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...