Switch to English

పవన్‌కళ్యాణ్‌ ఈజ్‌ బ్యాక్‌: వాళ్ళకి క్వశ్చన్‌ మార్క్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

జనసేనాని పవన్‌కళ్యాణ్‌ వచ్చేశాడు. జనంలోకి వెళ్ళడమే తరువాయి. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు జనసేనాని. అయితే, నిన్న మొన్నటిదాకా విన్పించిన ఊహాగానాల సారాంశం వేరు. ఇప్పుడు జరుగుతున్నది వేరు. అవును, పవన్‌ కళ్యాణ్‌ ఎవరి అంచనాలకూ అందడు. ‘మేం అధికారంలోకి వచ్చేస్తాం..’ అని పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడూ చెప్పలేదు, అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నదీ చెప్పారంతే. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఎప్పుడెలా మారతాయో ఎవరికీ తెలియదు. ఆ విషయం పవన్‌కళ్యాణ్‌కి బాగా తెలుసు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్న పవన్‌, జనసేన పార్టీ విషయంలో ఆచి తూచి అడుగేశారు.

జనసేన పార్టీ ఏర్పాటు, తదనంతర పరిణామాలు అందరికీ తెల్సినవే. కొన్ని ఈక్వేషన్స్‌ సెట్‌ అవలేదంతే. అలాగని, లక్ష్యాన్ని వదిలేసి పారిపోయేటంతటి పిరికి వ్యక్తి కాదు జనసేనాని. సినీ రంగంలో అఖండ విజయాలే కాదు, దారుణ పరాజయాల్నీ చవిచూశారు పవన్‌. పరాజయాలకు కుంగిపోలేదు, విజయాలకి పొంగిపోలేదు. రాజకీయాల్లోనూ పవన్‌కళ్యాణ్‌ తన సహజ వ్యక్తిత్వానికి భిన్నగా వ్యవహరించలేదు, వ్యవహరించరు కూడా. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి, సుమారు ఆరు శాతం వరకు ఓటు బ్యాంకుని సాధించింది ఆంధ్రప్రదేశ్‌లో. ఈ 6 శాతాన్ని 16 శాతం చేయడమెలా.? 26 శాతమో, 36 శాతమో.. కలిసొస్తే 46 శాతమో చెయ్యాలంటే, దానికోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి.? అన్న దిశగా జనసేనాని ఆలోచనలు సాగుతున్నాయిప్పుడు.

గ్రామ స్థాయిలో కార్యకర్తల్ని ఉత్సాహపరచడం, స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేయడం, ప్రజల్లో స్వచ్ఛమైన రాజకీయాల పట్ల మరింత అవగాహన పెంచడం.. ఇవీ జనసేన తదుపరి రాజకీయ కార్యాచరణలో ముఖ్యమైన అంశాలుగా కన్పిస్తున్నాయి. ‘మొదటి అడుగు పడింది కదా.. ఇకపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు..’ అని పవన్‌కళ్యాణ్‌ ధీమాగా చెప్పారంటే, ‘ఓటు వేసిన లక్షలాది మందికి కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారంటే.. ఆ మాటలు చాలు, జనసైన్యంలో కొండంత బలాన్ని నింపడానికి. ‘ఇక్కడితో జనసేన పనైపోయిందనుకున్నాం.. ఇదేం ఆటిట్యూడ్‌.? రేప్పొద్దున్న జనసేన మనకు ప్రత్యర్థిగా మారితే.?’ అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

జనసేనని పోటీదారుగా ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ కూడా చూడలేదు. ఇకపైనా చూడకపోవచ్చుగాక. కానీ, జనసేన లక్ష్యం వేరే. స్వచ్ఛ రాజకీయాలే జనసేన లక్ష్యం. పవన్‌ కళ్యాణ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఇది ఖచ్చితంగా ఇతర రాజకీయ పార్టీలకు పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. రాజకీయ సభలకు జనాన్ని రప్పించడంలో ఇప్పటిదాకా సక్సెస్‌ అయిన జనసేన, ఇకపై వచ్చిన జనాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో సక్సెస్‌ అవడంపై దృష్టిపెట్టింది. అందుకు తగ్గ రాజకీయ కార్యాచరణను కూడా సిద్ధం చేసుకుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయం మొదలైనట్లే.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల చేయించారు. కొన్ని రోజుల క్రితం విడుదల...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....