కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందంటూ ఏపీ సర్కారుపై విపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.337కే కొన్న కిట్ ను ఏపీ సర్కారు ఏకంగా రూ.1200 పెట్టి కొనుగోలు చేసిందంటూ విపక్ష నేతలు విమర్శలు చేశారు. అయితే, అదంతా దుష్ప్రచారమని, తాము ఒక్కో కిట్ కు రూ.730 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, ధర విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం ఇచ్చిన వివరణనూ విపక్షాలు తప్పుబట్టాయి.
సరుకు కొనేసిన తర్వాత బేరమాడటం ఏమిటని అటు సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో కేంద్రమే ఒక్కో కిట్ కు రూ.795 చెల్లించగా.. ఏపీ రూ.730 మాత్రమే వెచ్చించింది. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులకు కావాల్సిన మందులు, ఇతరత్రా పరికరాల కొనుగోలు, సరఫరా బాధ్యతలను ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) పర్యవేక్షిస్తుంది. కరోనా నేపథ్యంలో అవసరమైన ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కొనుగోలుకు కూడా ఈ సంస్థే హైదరాబాద్ లోని సండూర్ మెడిసియాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈనెల 7న ఆర్డర్ ఇచ్చింది.
ఒకవేళ ఇంతకంటే తక్కువకే ఈ కిట్స్ సరఫరా చేసినట్టు తమ దృష్టికి వస్తే, తాము కూడా ఆ ధరే చెల్లిస్తామని.. దీనికి సంబంధించిన మొత్తాన్ని తుది బిల్లు నుంచి రికవరీ చేస్తామని ముందుగానే క్లాజ్ పెట్టింది. ఛత్తీస్ గఢ్ కు రూ.337కే కిట్ వచ్చిన నేపథ్యంలో తాము కూడా జీఎస్టీ కాకుండా కిట్ కు రూ.337 మాత్రమే చెల్లిస్తామని ఏపీఎంఎస్ఐడీసీ స్పష్టంచేసింది. ఈ మేరకు సండూర్ కంపెనీకి లేఖ కూడా రాసింది. అలాగే, ధర ఎందుకు ఎక్కువ కోట్ చేశారో చెప్పాలని కూడా అడిగింది.
714690 171407An intriguing discussion will probably be worth comment. I believe which you simply write much a lot more about this subject, it may well become a taboo topic but usually consumers are inadequate to communicate in on such topics. To yet another. Cheers 587900
628703 487164I adore this info presented and possesses given me some type of resolve forpersistance to succeed i really enjoy seeing, so sustain the excellent function. 205414
624410 964091I generally cant discover it in me to care enough to leaves a comment for articles on the internet but this was really pretty excellent, thanks and keep it up, Ill check back once again 588386
374220 391168I like this web site its a master peace ! Glad I detected this on google . 340675