Switch to English

బుకాయింపుతోనే సరి.. విజయసాయిరెడ్డికి ‘ఆ’ ధైర్యమెక్కడిది.?

భారతీయ జనతా పార్టీ నుంచి తొలిసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఘాటైన విమర్శ దూసుకొచ్చింది. అదీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి మీద ‘జైలు పక్షి’ అంటూ బీజేపీ విమర్శించడమంటే ఆషామాషీ వ్యవమారం కాదు. ఏపీ బీజేపీ ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా చేసిన ఘాటైన విమర్శతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడ్డాయి.

ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణను విమర్శించే క్రమంలో విజయసాయిరెడ్డి ‘మాట’ తూలడం ఇప్పుడు వైసీపీ వర్గాల్ని అయోమయంలో పడేసింది. దాంతో, విజయసాయిరెడ్డి డ్యామేజీ కంట్రోల్‌ చర్యలకు దిగారు. ‘మళ్ళీ అడుగుతున్నా.. కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా..’ అంటూ తాజాగా ట్వీటేశారు విజయసాయిరెడ్డి. ‘జాకాల్స్‌’ అంటే గుంటనక్కలు.. ఆ ‘గుంటనక్క’ అనే విమర్శ బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి మీదకు దూసుకొచ్చింది.

‘అక్కుపక్షి.. జైలు పక్షి.. సూట్‌ కేస్‌ రెడ్డి.. చీకట్లో చిల్లర లెక్కలు చూస్కో.. పాపం పండే టైవ్‌ు వచ్చింది.. 5 రూపాయల ఆర్టిస్ట్‌..’ అంటూ ఏపీ బీజేపీనే విమర్శించాక, విజయసాయిరెడ్డి ఇంకా బుకాయించి ఏం లాభం.? చేతనైతే విజయసాయిరెడ్డి బీజేపీని స్ట్రెయిట్‌గా విమర్శించగలగాలి. ఆ ధైర్యం లేకనే ‘గుంట నక్కలా’ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలే విమర్శిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారంపై ఇప్పటికే వైఎస్‌ జగన్‌ నుంచి విజయసాయిరెడ్డికి అక్షింతలు పడ్డాయనీ, దాంతో, ‘టీడీపీ జాకాల్స్‌ పార్టీ’ అంటూ కొత్త నినాదాన్ని విజయసాయి తెరపైకి తెచ్చారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ట్రంప్ ఒక ఫూల్ కాబట్టే అమెరికా ఇలా ఉంది: జో బెడెన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఫూల్ అంటూ విరుచుకుపడ్డారు అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్. అమెరికాను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్నా అధ్యక్ష హోదాలో ఉండి...

నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. గ్యాంగ్ స్టర్ కాల్చివేత

గ్యాంగ్ స్టర్ లు ఎలా ఉంటారో, గ్యాంగ్ వార్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలంటే మనం రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూడాల్సిందే. సత్య, కంపెనీ.. వంటి సినిమాలను ఆ కథలతోనే తెరెకెక్కించి రీల్...

మరో స్టార్‌ను బలి తీసుకున్న కరోనా

కరోనా కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం సినీ కార్మికులు మాత్రమే కాకుండా కొందరు స్టార్స్‌ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే...

ఫైర్ యాక్సిడెంట్: సికింద్రాబాద్ లో బూడిదైన 10 గుడిసెలు.!

తెలంగాణ, సికింద్రాబాద్, బోయినపల్లిలోని బాపూజీ నగర్ లో గుడిసెల్లో రోజువారి కూలీలు నివాసం ఉంటారు. అక్కడ ఒక్క గుడిసెలో సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. అతి తక్కువ టైములో...

కరోనా ఎఫెక్ట్‌.. 3డి న్యూస్‌ రీడర్స్‌ వచ్చేశారు.!

కరోనా ప్రపంచాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిస్తున్న సమయంలో పలు రంగాలు కుదేలవుతున్నాయి. ఈ సమయంలో సామాజిక దూరం పాటించే ఉద్దేశ్యంతో జపాన్‌, చైనా, సింగపూర్‌ వంటి అభివృద్ది...