Switch to English

అమరావతిలో సీఎం జగన్‌ వాస్తు ‘పోటు’!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,444FansLike
57,764FollowersFollow

అరెరే.! అంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిందా.? లేదా.? చంద్రబాబు స్థానంలో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యింది నిజమా.? కాదా.? ఇలాంటి డౌట్లు వస్తున్నాయేంటీ.! డౌట్లు వస్తాయి మరి. ఎందుకంటే, వైఎస్‌ జగన్‌ కూడా చంద్రబాబు అడుగు జాడల్లోనే నడుస్తున్నారు కదా. చంద్రబాబు చేస్తే తప్పు. వైఎస్‌ జగన్‌ చేస్తే రైటు.. అన్నట్లుగా వైసీపీ నేతలు తమ అధినేత చర్యల్ని సమర్ధిస్తున్నారు. అచ్చం టీడీపీ నేతలు నిన్న మొన్నటి దాకా చంద్రబాబును సమర్ధించినట్లే. అమరావతిలో తాత్కాలిక సచివాలయం కొన్ని మార్పులకు గురవుతోంది. మార్పు చిన్నదే అని తీసి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే బోలెడంత ఖర్చుతో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నారక్కడ. జనం సొమ్ము కదా.. అందరికీ చులకనే. జవాబుదారీతనం లేకపోతే, వాస్తు దోషాలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి.

వాస్తు, జాతకాలు వంటివి ఏ రాజకీయ నాయకుడైనా తన ఇంట్లోనే చూసుకోవాలి. కానీ, జనం సొమ్ముని విచ్చల విడిగా ఖర్చు చేయడానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు అధికార పీటమెక్కగానే వాస్తు పేరుతో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు. అన్ని రకాలుగా చర్చించి వాస్తు నిపుణుల్ని రప్పించి, గొప్ప గొప్ప ఇంజనీర్లతో సచివాలయాన్ని నిర్మించిన చంద్రబాబు, ఆ తర్వాత దానికి చేసిన రిపేర్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యమంత్రికి వాస్తు పిచ్చి ఉండకూడదు. చంద్రబాబు ఏమైనా సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారా.? అది జనాలికి చెందాల్సిన డబ్బు.. అని అప్పటి ప్రతిపక్ష నేత వాస్తు ఖర్చులపై మండి పడ్డారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదేంటీ..

సచివాలయంలో వాస్తు పేరుతో రిపేర్లు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి కూడా. ఎందుకంటే జగన్‌ మంత్రివర్గం ఇంకా ఖరారవ్వలేదు. ఒక్కో మంత్రీ తన ఛాంబర్‌ని వాస్తుకనుగుణంగా మార్చితే, ఖర్చు తడిసి మోపెడయిపోతుంది. అప్పుడు చంద్రబాబు చేసిందీ పిచ్చిపనే. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేయిస్తున్నదీ పిచ్చి పనే. వాస్తు, జ్యోతిష్యం, జాతకం నమ్మకాలకు సంబంధించింది. ముఖ్యమంత్రి గదికి వాస్తు సరిగా లేకపోతే, రాష్ట్రానికే అరిష్టం అంటూ కొందరు పండితులు ప్రదర్శించిన అత్యుత్సాహం, పాలకులకు లైసెన్స్‌ ఇచ్చినట్లవుతోంది.

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వాస్తు నమ్మకాలతోనే సెక్రటేరియట్‌ మొహం చూడలేదు ఇన్నేళ్లలో ఎప్పుడూ. ఏదో మార్పులు చేయించుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సెక్రటేరియట్‌కి వెళ్తున్నందుకు సంతోషించాలా.? వాస్తు పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నందుకు బాధపడాలా.? ప్రశ్నించేందుకు పుట్టిన జనసేన పార్టీ, తన తొలి ప్రశ్నని ఈ కోణంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై సంధించాల్సి వుంది. ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఎలాగూ ప్రశ్నించదు. వాస్తు పిచ్చిని పరిచయం చేసిందే ఆ పార్టీ కదా!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...