Switch to English

ప్రత్యేక హోదా కాలగర్భంలో కలిసిపోయినట్టేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఐదేళ్లపాటు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ రాజకీయంగా యాక్టివ్‌గా ఉండగలిగారంటే, దానికి కారణం ప్రత్యే హోదా అంశమే. ప్రత్యేక హోదా ఉద్యమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ని తానేనంటూ వైఎస్‌ జగన్‌ చాలా హంగామా చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదని తెలిసి, వైఎస్‌ జగన్‌ తన ఇమేజ్‌ని పెంచుకోవడానికి హోదా ఉద్యమాన్ని ఓ ఆయుధంగా మార్చుకున్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి హోదా తెప్పించుకోలేని చంద్రబాబు అసమర్ధత వైఎస్‌ జగన్‌కి వరంలా మారింది. నాలుగేళ్లు హోదా పేరుతో చాలా రకాల పబ్లిసిటీ స్టంట్లు చేసి, చివరికి అత్యంత వ్యూహాత్మకంగా, ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా చూసుకుని, అప్పటి తమ ఎంపీలతో రాజీనామా చేయించారు వైఎస్‌ జగన్‌.

కానీ ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఏ ఒక్క నేత కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీకి వెళ్లి మోడీకి సాగిలా పడి వచ్చాక వైసీపీ నేతలో ప్రత్యే హోదాపై మాట్లాడడానికి ఏమీ లేదు. అప్పుడు చంద్రబాబు చేసిందీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్నదీ ఒక్కటే. అప్పట్లో తమ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించిన వైఎస్‌ జగన్‌ ఇప్పుడింతలా బేలతనం చూపించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అప్పుడూ బీజేపీకి కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇప్పుడూ అదే పరిస్థితి. అప్పటికీ, ఇప్పటికీ వైఎస్‌ జగన్‌ గుర్తించిన తేడా ఏంటో ఆయన ప్రత్యేక హోదా విషయంలో ఎందుకిలా యూటర్న్‌ తీసుకున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు.

పాతిక మంది ఎంపీలను ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్‌ జగన్‌ చెప్పారు. పొరుగు రాష్ట్ర ఎంపీల్ని కలుపుకుని కేంద్రంపై పోరాడతామన్నారు. ఇప్పుడు ఆ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వేదిక పంచుకుని ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌, ఆ వేదిక పై నుండి ప్రత్యేక హోదా సాధించి తీరతాం.. అని నినదించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డున ప్రత్యేక హోదాని జగన్‌ పాతరేయడం వెనుక నడిచిన రాజకీయం ఏంటో, హోదా గురించి మాట్లాడలేనంతగా వైఎస్‌ జగన్‌పై వచ్చిన రాజకీయ ఒత్తిడులేంటో తెలియాల్సి ఉంది.

తండ్రిని మించిన పేరు, ప్రఖ్యాతలు సంపాదిస్తాననీ, విశ్వసనీయత విషయంలో తనకు తిరుగే లేదని చెప్పుకునే వైఎస్‌ జగన్‌, ప్రత్యేక హోదా విషయంలో ఇంతలా కేంద్రం ముందు తలొంచుతారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు కనుక, పాలనా వ్యవహారాలపై తనదైన ముద్ర వేయాలి కనుక ఇంకొంత కాలం వేచి చూస్తే అయినా ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ ఆలోచన మారుతుందా.? లేదంటే, ఢిల్లీ పెద్దల కన్నెర్రకు జడిసి ప్రత్యేక హోదాను జగన్‌ కాలగర్భంలో కలిపేశారా.? వేచి చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...