Switch to English

Home సినిమా సినిమా రివ్యూ: ఎన్జీకే

సినిమా రివ్యూ: ఎన్జీకే

0
సినిమా రివ్యూ: ఎన్జీకే
ngk-1
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

నటీనటులు : సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, దేవరాజ్, బాలా సింగ్, నీలాల్ గల్ రవి, పోన్ వన్నన్ తదితరులు
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీ రాఘవ
నిర్మాతలు : ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
మాటలు : రాజేష్ మూర్తి
కెమెరా : శివకుమార్ విజయన్
సంగీతం: యువన్ శంకర్ రాజా

ఈ మధ్య తమిళ హీరో సూర్యకు వరుస ప్లాపులు తెగ టెన్షన్ పెడుతున్నాయి. అందుకే ఈ సారి కొత్త తరహా ప్రయోగం చేయాలనీ భిన్నమైన చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెల్వ రాఘవన్ ( శ్రీరాఘవ ) తో సినిమా ప్లాన్ చేసాడు సూర్య. ఎన్జీకే పేరుతొ విడుదలైన ఈ సినిమాతో అయినా తన ప్లాపులకు పుల్ స్టాప్ పడుతుందని ఆశపడుతున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నంద గోపాల కృష్ణ పేరుతో తెలుగులో కూడా ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఎన్జీకే ఎవరు ? ఆయన కథేమిటి? మరి ఈ సినిమాతో సూర్య హిట్ అందుకున్నాడా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

నంద గోపాల కృష్ణ ( ఎన్జీకే ) ఎంటెక్ ( అగ్రికల్చరల్ ) పూర్తి చేసి విదేశాల్లో కొన్నాళ్ళు జాబ్ చేసి .. ఇక్కడ ఇండియాలోనే ఉంటూ సేంద్రియ పద్దతిలో వ్యవసాయం పండించాలని తన ఊరివాళ్లతో కలిసి వ్య్వవసాయం చేస్తుంటాడు. తన ఊరివాళ్ళందరి తలలో నాలికల ఉండే గోపాల్ అంటే అక్కడున్న వారికీ మంచి అభిమానం. అతని భార్య గోపిక కుమారి (సాయి పల్లవి) తన భర్తకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఊరిలో సేంద్రియ వ్యవసాయం చేయడం ఇష్టంలేని కొందరు ఎంఎల్ఏ మనుషులు ఆ పంటలను నాశనం చేస్తారు. దాంతో పెద్ద నష్టం కలగడంతో పాటు రౌడీలు వీరిని బెదిరిస్తారు. పలు రకాలుగా ఇబ్బందులు పెడతారు. ఈ విషయం గురించి ఎంఎల్ఏను కలిసి తనను, తనవాళ్లను రౌడీలు బెదిరిస్తున్నారని, వారిని ఆపమని చెప్పండి అని చెబుతాడు. దాంతో ఎంఎల్ఏ నేను సహాయం చేస్తాను. మరి నాకేమిస్తావ్ అని అతనిని ఇరుకున పెడతాడు. ఈ దేశంలో పనులు జరగాలంటే పలుకుబడి ఉండాలని తెలుసుకున్న గోపాల్ .. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంఎల్ఏ దగ్గర సహాయకుడిగా చేరి రాజకీయాలు నేర్చుకుంటాడు.పెద్ద లక్ష్యంతో తెలివిగా అడుగులు వేస్తున్న అతడు చాలా మందికి విరోధి అవుతాడు. అతని ఎదుగుదలను సహించని కొందరు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు? మరి వాటన్నిటిని తట్టుకుని ఎన్జీకే అనుకున్న లక్ష్యాన్ని సాదించాడా ? లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

ఎన్నో అద్భుత చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోలతో సమానంగా ఇక్కడ మార్కెట్ పెంచుకున్న హీరో సూర్య చేయాల్సిన సినిమా మాత్రం ఇది కాదు. హీరో పాత్ర కోసం సూర్య చాలా కష్టపడ్డాడు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంది. సూర్య నటన గురించి కూడా కొత్తగా చెప్పాల్సింది ఏమిలేదు. ఎందుకంటే పాత్ర నేపథ్యం బట్టి సూర్య ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అయితే ఈ సినిమాలో అసలు కథేమిటి ? ఎవరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థం కాదు. హీరో అనవసర విషయాల్లో ఎక్కువ తలా దూర్చడం చికాకు తెప్పిస్తుంది. ఇక హీరో భార్య పాత్రలో నటించిన సాయి పల్లవి రెండు మూడు సన్నివేశాల మినహా ఎక్కడ కన్పించదు. పైగా ఆమె పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదు. ఇక గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం మంచి పాత్ర పట్టేసింది. రకుల్ ఈ తరహా పాత్రలో మొదటి సారి చేసి అదరగొట్టింది. ఇక మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమిలేదు.

టెక్నీకల్ హైలెట్స్ :

సాంకేతిక విషయాల గురించి ప్రస్తావిస్తే .. ఈ సినిమాలో కేవలం మూడు సాంగ్స్ మాత్రమే ఉన్నాయి .. అందులో ఒకటి రొమాంటిక్ సాంగ్ .. ఉన్నంతలో ఆ సాంగ్ బాగుంది .. మిగతా రెండు పాటలు అసలు వినడానికి బాగా లేవు. ఇక రీ రీకార్డింగ్ గురించి పెద్దగా చెప్పుకునేది ఏమి లేదు .. యువన్ – సెల్వ రాఘవన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు నేపథ్య సంగీతం హైలెట్ గా నిలుస్తాయి .. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ విషయం గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్. విజయ్ శివకుమార్ ఛాయా గ్రహణం .. యావరేజ్. ఎక్కడా ఫోటోగ్రఫి అద్భుతంగా అనిపించదు. ఇక ఎడిటింగ్ విషయం కూడా చెప్పుకోవడానికి ఏమి లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు సెల్వరాఘవన్ గురించి చెప్పాలంటే .. భిన్నమైన కథలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అయన ఎందుకు ఈ పొలిటికల్ కథను ఎంచుకున్నాడో అర్థం కానీ విషయం. ఏమాత్రం ఆసక్తి లేని కథ .. కథనం ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ఎక్కడ పసలేని కథ, ఎలాంటి మలుపులు లేకుండాసాగిపోతుంది. కథలను అద్భుతంగా డీల్ చేసే సెల్వ రాఘవ ఈ సినిమా విషయంలో ఎక్కడో మిస్టేక్ చేసాడని అనిపిస్తుంది. అసలు ఈ కథను ఎందుకు ఆయన ఎంచుకున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు సినిమాలో ఏమాత్రం ఆయన శైలి ఎక్కడా కనిపించదు.

విశ్లేషణ :

ప్రస్తుతం సినిమాల్లో ట్రెండ్ మారింది .. ముఖ్యంగా ప్రేక్షకులు బాగా అడ్వాన్స్ అయిపోయారు. రాజకీయాలంటే కార్యకర్తలు కేవలం పనిమనుషులు అనే ఆలోచనలోనే ఉన్నాడు దర్శకుడు. ఇప్పుడు అంతా మారిపోయింది. రాజకీయాల్లోకి వచ్చే వారు ఎన్నో జిమ్మిక్స్ చేసి క్రేజ్ తెచ్చుకుని ఆశించిన పదవుల్లో రాణిస్తున్నారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి గా ఎదగడం అన్నది మంచి పాయింట్ .. కానీ దానికి అవుట్ డేటెడ్ కోటింగ్ ఇచ్చి బోర్ కొట్టించాడు దర్శకుడు. సూర్య లాంటి హీరోని పెట్టుకుని ఎలాంటి సినిమా చేయొచ్చు .. కానీ పేలవమైన కథను ఎంచుకుని అంతకంటే పేలవంగా ఎన్జీకే ను తయారు చేసాడు. సూర్య, రకుల్ ఈ సినిమాకు ప్లస్ అయితే .. మిగతా అంశాలన్నీ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. మొత్తానికి ఓ బోరింగ్ కథనాన్ని ప్రేక్షకుల మీదకు రుద్దే ప్రయత్నం చేసారు.

ట్యాగ్ లైన్ .. : గోపాలం .. బోర్ కొట్టేస్తాడు.