Switch to English

కరోనా టెస్ట్‌లు: ఏపీలో ఇలా.. తెలంగాణలో అలా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దూసుకెళ్తోంది.. తెలంగాణ మాత్రం మీన మేషాల్లెక్కెడ్తోంది ఇబ్బడి ముబ్బడిగా పరీక్షలు చేయడంలో. తాజాగా హైకోర్టు మొట్టికాయలేయడంతో తెలంగాణలో కరోనా టెస్టులు పెరుగుతాయా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘హైకోర్టు ఆదేశాల మేరకు టెస్టులు చేయడం కుదరని పని..’ అన్న అభిప్రాయం ప్రభుత్వం నుంచి వ్యక్తమవుతోంది. ‘చనిపోయిన ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాదు..’ అన్నది తెలంగాణ ప్రభుత్వం వాదన.

ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలు మారు మూల గ్రామాల్లోనూ చేసేలా చర్యలు చేపడ్తోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. కరోనా వైరస్‌ పట్ల అవగాహనా కార్యక్రమాల్ని మరింత పెంచాలనీ, ఏమాత్రం అనుమానమొచ్చినా స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి పరీక్షలు చేయించుకునేలా వారిలో అవగాహన కల్పించాలనీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు తెలంగాణలో జరిగితే.. కేసుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదవుతుందనీ, అందుకే తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షల విషయంలో భయపడ్తోందనీ తెలంగాణలో విపక్షాలు విమర్శల బాణాల్ని ఎక్కుపెడుతుండడం గమనార్హం.

కాగా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో నమోదవుతున్న కేసులు, వైద్య విభాగంలో పెరుగుతున్న కేసుల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైద్య సిబ్బందికి కరోనా సోకడం చాలా ఇబ్బందికరమైన సమస్య. అదే సమయంలో, కరోనా వైరస్‌కి చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రి అయిన గాంధీలో సరైన వసతులు లేవంటూ వస్తున్న రాజకీయ విమర్శలు, అందుకు అనుగుణంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియోలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.

తెలంగాణలో కరోనా వైరస్‌తో బాధపడేవారికి వైద్య చికిత్స అందించేందుకు అన్ని సౌకర్యాలూ వున్నాయనీ, ఏ స్థాయిలో కేసులు నమోదైనా చికిత్స అందించడానికి సమస్య లేదన్నది తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట. మరి, పరిస్థితులు ఇంత అనుకూలంగా వున్నప్పుడు టెస్ట్‌లు తగిన స్థాయిలో ఎందుకు జరగడంలేదు.? ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే దొరకడంలేదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...