Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: నందమూరి బాలకృష్ణకు ఆ ధైర్యముందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలోనూ, అటు రాజకీయాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారారిప్పుడు. సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలపైనా, రాజకీయాలపైనా గత కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ‘విపరీత వ్యాఖ్యలే’ అందుక్కారణం. ఇక్కడ ‘విపరీత వ్యాఖ్యలు’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, తెలుగు సినీ పరిశ్రమ తరఫున తెలంగాణ ప్రభుత్వంతోనూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోనూ ఓ బృందం చర్చలు జరుపుతోంటే.. దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు మరి.

కరోనా వైరస్‌ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ బాగు కోసం కొందరు నడుం బిగించారు. బాలకృష్ణ మాత్రం, ‘భూములు పంచుకోవడానికా.?’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణలోని అధికార పార్టీని కూడా గట్టిగా కెలికేశారు. సినీ పరిశ్రమ ప్రముఖులు బాలయ్య విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ‘చెడుని చెవిలో చెప్పాలి.. మంచిని మైక్‌లో చెప్పాలి..’ అని ఆ మధ్య సినీ పరిశ్రమలోనివారికి చిరంజీవి హితబోధ చేస్తే, దానికీ బాలయ్య తాజాగా వక్రభాష్యం చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ తరఫున నలుగురు అగ్రహీరోల్లో.. బాలకృష్ణ కూడా ఒకరు. చిరంజీవి మాత్రమే ఎందుకు బాధ్యత తీసుకోవాలి.? బాలకృష్ణ ముందడుగు వేసి.. ఆయనే ఆ పెద్దరికాన్ని అందిపుచ్చుకోవచ్చు కదా.? స్వర్గీయ నందమూరి తారకరామారావు తనయుడిగా బాలకృష్ణకి ఇటు సినీ పరిశ్రమలోనూ అటు రాజకీయాల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు వుందన్నది నిర్వివాదాంశం. ఇంకా నయ్యం.. బాలకృష్ణ, టీడీపీ బాధ్యతలు చేపట్టడానికే ధైర్యం చేయడంలేదు.. సినీ పరిశ్రమ బాధ్యతల్ని భుజానికెత్తుకుంటారా.? అన్నది ఇంకొందరి వెర్షన్‌.

ఎవరి వాదనలు ఎలా వున్నా.. బాలయ్యకు, సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై స్పందించే బాధ్యత మాత్రమే కాదు.. సమస్యలపై స్పందించి.. పరిశ్రమ తరఫున ‘లీడ్‌’ తీసుకునే అవకాశం వుంది. కానీ, ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలేదు. పరిశ్రమపై విమర్శలు చేయడానికి చాలామందే వున్నారు.. అలా బాలయ్య కూడా ‘గుంపులో గోవిందా’ అనడం వల్ల ఉపయోగమేంటి.?

ఇక్కడ మేటర్‌ క్లియర్‌.. బాలకృష్ణ డైరెక్ట్‌గానే చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి నాయకత్వాన్ని బాలకృష్ణ అస్సలేమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ, పరిశ్రమ అంతా చిరంజీవికి నాయకత్వ బాధ్యతల్ని అప్పగించింది. బాలయ్య విమర్శించారనో.. ఇంకో కారణంతోనో.. పరిశ్రమ తన భుజాల మీద పెట్టిన బాధ్యతను చిరంజీవి వదిలేసుకోలేరు కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...