Switch to English

అతడినే పెళ్లి చేసుకుంటానన్న అనుష్క.!

ఏంటి ? అనుష్క అతడినే పెళ్లి చేసుకుంటా ? అని గట్టిగా చెప్పింది? ఇంతకీ ఎవరతను ? .. సినిమా స్టారా.. లేకా బిజినెస్ మెన్నా అంటూ షాక్ అవుతున్నారా !! అసలు విషయం ఏమిటంటే .. టాలీవుడ్ జేజమ్మ అనుష్క తాజాగా నటిస్తున్న నిశ్శబ్దం సినిమా గురించి ఎలాంటి టాక్ రావడం లేదు. నిజానికి ఈ నెలలోనే సినిమాను విడుదల చేయాలన్న ప్రయత్నాలు అయితే జరిగాయి,  కానీ మధ్యలో ఏమైందో మరి టైటిల్ తగ్గట్టే అటు టీమ్ కూడా సైలెంట్ గా ఉంది. ఈ విషయం పక్కన పెడితే అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే పలు రకాల న్యూస్ హల్చల్ చేసాయి. డార్లింగ్ హీరో ప్రభాస్ తో ఎక్కువగా సినిమాలు చేయడం, ఇద్దరు కలిసి తిరగడంతో వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారంటూ, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై అటు ప్రభాస్, ఇటు అనుష్క స్పందించడంతో, ఈ వార్తలకు చెక్ పడింది.

అయితే అనుష్క ఎవరో బిజినెస్ మెన్ ని లవ్ చేస్తుందని, ప్రస్తుతం అతగాడితో ప్రేమాయణం సాగిస్తోందంటూ వార్తలు వచ్చాయి, అదే కాకుండా ఈ మద్యే అనుష్క ఓ క్రికెటర్ తో ఘాటు ప్రేమలో పడిందని, అతగాడిని పెళ్లి చేసుకుంటుందని లేటెస్ట్ ప్రచారం. సినిమా రంగంలోకి వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఇంకా అనుష్క పెళ్లి చేసుకోకవడంతో ఇలా రకరకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపై అనుష్క స్పందించింది. నా పెళ్లి పై వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదు, నేను ఎవరిని ప్రేమించడం లేదు, మా అమ్మా నాన్నలు అబ్బాయికోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఎవరిని చేసుకోమంటే అతన్నే చేసుకుంటా అంటూ కాస్త గట్టిగానే స్పందించింది.

అనుష్క మరి ఈ రేంజ్ లో స్పందించడంతో అంతా సైలెంట్ అయ్యారు. నిజమే .. అనుష్క పెళ్లి పై రోజుకో ప్రచారం జరుగుతూ నానా రచ్చ జరుగుతుంది. రెండు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అనుష్క మొదటి తెలుగు సినిమా నాగ్ సరసన సూపర్ లో చేసింది. ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారి టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగింది. అరుంధతి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ హీరోలకు ధీటుగా బాక్స్ ఆఫీస్ విజయాన్ని అందుకుని దుమ్ము రేపిన అనుష్క లేడి ఓరియంటెండ్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

సీఎం జగన్‌ 2020 క్యాలెండర్‌ అదిరిందిగానీ.!

సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతోంది. విభజన నేపథ్యంలో ఏర్పడ్డ కష్టాలు...

గుడ్ న్యూస్: జూన్ నుంచి షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్.!

నిన్ననే(మే 21న) సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులంతా కలిసి సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, అలాగే థియేటర్స్ పరిస్థితిపై...

శ్రీదేవి ఇంట కరోనా పాజిటివ్ నమోదు

హాలీవుడ్ వారితో పోల్చితే ఇండియన్ సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం తక్కువే. ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ కరోనా బారిన పడి ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ కు కూడా...

విశాఖ వాసుల్ని బెంబేలెత్తించిన దట్టమైన పొగలు

12 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో ఘటన విశాఖ ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. కొద్దిసేపటి క్రితం విశాఖ, మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన...