ఒకానొక టైంలో వరుసగా డజను పైగా ప్లాప్స్ చూసిన నందమూరి బాలకృష్ణకి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బాలయ్య సరైన హిట్ లేక అదే పరిస్థితిలో ఉన్నాడు. దాంతో ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుకే బాలయ్యే అవకాశం ఇచ్చాడు. పక్కాగా హిట్ కొట్టాలని బోయపాటి కూడా తొందర పడకుండా పక్కాగా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు.
గత కొద్దీ రోజులుగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కానీ ఎవరూ ఫిక్స్ కావట్లేదు. ఇప్పటికే పలువురు పేర్లు వినిపించేసాయి. ఇప్పుడు మాకు అందిన సమాచారం ప్రకారం దాదాపు బాలయ్యకి హీరోయిన్స్ దొరికేసినట్టే అనిపిస్తోంది. స్ట్రాంగ్ లేడీ రోల్ కోసం తెలుగమ్మాయి అంజలిని ఫైనల్ చేశారట. ఇటీవలే బోయపాటి కలిసి అంజలికి కథని వినిపించగా, తనకి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశారు. అతి త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. అంజలి కూడా గతంలో బాలయ్యతో కలిసి డిక్టేటర్ సినిమాలో నటించింది.
అంజలి కాకుండా మరో పాత్ర కోసం ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ లాంటి సినిమాల్లో జోడీ కట్టిన శ్రియ సరన్ ని ఫైనల్ చేశారట. మార్చి మొదటి వారం నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది.
240335 885061Someone essentially lend a hand to make critically articles Id state. That could be the very first time I frequented your website page and so far? I amazed with the research you produced to create this actual post extraordinary. Fantastic activity! 326496