Switch to English

సిట్ బాధ్యతలు రఘురామిరెడ్డికి ఎందుకంటే..?

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలను తవ్వి తీయడమే ప్రధాన ధ్యేయంగా అధికార పార్టీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగానే గత ఐదేళ్ల కాలంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలను నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దానికి సర్వ అధికారాలూ కట్టబెట్టింది. ఇంతటి కీలకమైన బాధ్యతలను ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డికి అప్పజెప్పింది.

రాష్ట్రంలో ఎందరో సీనియర్ అధికారులు ఉండగా.. జగన్ సర్కారు ఆయన్నే ఎందుకు ఎంచుకుంది అని చూస్తే, ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి. ఇక్కడ రెడ్డి అనే కోణాన్ని కాకుండా రఘురామిరెడ్డి ట్రాక్ రికార్డు చూసే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. ముక్కుసూటి అధికారిగా పేరున్న రఘురామరెడ్డి.. ఆర్థికపరమైన అవకతవకల కేసులను పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి కేసులు ఆయన దగ్గరకు వస్తే వాటి అంతు చూసేదాకా వదిలిపెట్టరని పేరు.

ఆమ్వే ఇండియా, ఎన్ మార్ట్, నక్షత్ర, అక్షయ గోల్డ్ వంటి కేసులను దర్యాప్తు చేసి, నిందితులకు చుక్కలు చూపించింది ఈయనే. పైగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ 2014 ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు కూడా చేశారు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా ఉన్న రఘురామరెడ్డిని ప్రకాశం జిల్లాకు బదిలీ చేస్తే.. పరిపాలనా ట్రిబ్యునల్ కు వెళ్లి అక్కడ విజయం సాధించారు. తిరిగి కర్నూలు ఎస్పీగా వచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో తెలివిగా డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.

ఐదేళ్ల డిప్యుటేషన్ ముగియడం.. ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో తిరిగి రాష్ట్ర సర్వీసులకు వచ్చేశారు. ఇదే సమయంలో సీఎం ఆయన్ను పిలిచి మంచి బాధ్యతలు అప్పగించారు. ఇక రఘురాముడు రంగంలోకి దిగడమే తరువాయి. జగన్ కోరుకున్నట్టుగా చంద్రబాబును ఆయన ఫిక్స్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

మహిళా వాలంటీర్ ఆత్మహత్య.. మరో వాలంటీర్ తో ప్రేమే కారణమా..?

పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటి వద్దకే చేరాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ అక్కడక్కడా అసలు లక్ష్యం తప్పుతోంది. వ్యక్తిగతంగా వలంటీర్లపై వస్తున్న విమర్శలతో అభాసుపాలు అవుతోంది. విశాఖ...

దారుణం: వలస కూలీల బస్సు బోల్తా – 33మందికి గాయాలు.!

ఈ కరోనా వైరస్ తెచ్చిన లాక్ డౌన్ వలన అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంది మాత్రం వలస కూలీలే అని చెప్పాలి. ఉన్న చోట తిండి లేక కొందరు, కాలినడకన కొందరు, మార్గ...

క్రైమ్ న్యూస్: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అఘాయిత్యం

ప్రేమ పేరుతో షాద్‌ నగర్‌కు చెందిన భాను యువతిపై దారుణంకు పాల్పడ్డారు. స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న యువతిని భాను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఇటీవల ఆమెను ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ...

జగన్ ఏడాది పాలన: సంక్షేమం సరే.. అభివృద్ధి మాటేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది మే 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో...

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...