Anupama Parameswaran : మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రేమమ్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు లో లక్కీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాలో నటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనుపమ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.
ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ అమ్మడు డీజే టిల్లు సినిమా యొక్క సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.
ఇన్నాళ్ల కెరీర్ లో అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు కూడా చేయని స్కిన్ షో ను మరియు రొమాంటిక్ సన్నివేశాలను ఇంకా ముద్దు సన్నివేశాలను సిద్దుతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమాలో చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అనుపమ కెరీర్ లో ఇది మరో బిగ్ టర్నింగ్ పాయింట్ గా ఉంటుందని.. ముందు ముందు ఆమె నుండి మరిన్ని ఆ తరహా సినిమాలు వస్తాయని అంటున్నారు.