ఎట్టెట్టా.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనేనటా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,309FansLike
57,764FollowersFollow

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవడో. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తోన్న లీకులు కూడా అలాగే వున్నాయి మరి. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఇలానే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే, ఆయన బీజేపీలోకి వెళ్ళకుండా జనసేన పార్టీలో చేరారు. అయితే, వీవీ లక్ష్మినారాయణను బీజేపీలోకి రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసి, అవి కుదరకపోవడంతో చివరికి కన్నా లక్ష్మినారాయణతో సరిపెట్టుకున్నారు.

తాజా ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఘోరంగా దెబ్బతింది. కనీస ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది ఆ పార్టీకి. అయినాగానీ, తగుదునమ్మా.. అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చిచ్చు పెడుతున్నారు కమలనాథులు. ఇప్పటికే నలుగురు టీడీపీరాజ్యసభ సభ్యుల్ని లాగేసిన బీజేపీ, మరికొందరు టీడీపీ ముఖ్య నేతల్ని లాగేసి ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులు జన బలం లేని నేతలన్నది జగమెరిగిన సత్యం. అయినాగానీ, టీడీపీని మానసికంగా దెబ్బకొట్టడానికి ఇదొక వ్యూహం.

మరోపక్క, అసెంబ్లీలో ఇప్పుడు టీడీపీకి వున్న బలంలో మూడింట రెండొంతుల మందిని లాగేద్దామనే ఆలోచనలో వుంది బీజేపీ అధిష్టానం. ఆ లెక్కన గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారట. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడంలో సిద్దహస్తుడైన గంటా శ్రీనివాసరావు వెళితే గిలితే వైఎస్సార్సీపీలోకి వెళతారుగానీ, బీజేపీలోకి వెళతారా.? ఏమో, బీజేపీ స్కెచ్‌ ఎలా వుందో చెప్పలేం. బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు వెళ్ళడమంటూ ఖాయమైనా, ఆయన ముఖ్యమంత్రి అవనుండడంపై బీజేపీ సానుకూలంగా వున్నా.. అదంతా జరిగేందుకు చాలా టైమ్‌ పడుతుంది.

అవన్నీ జరగాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోవాలి, బీజేపీ అధికారంలోకి రావాలి. అది జరిగే పని కాదు. సో, గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అవుతారన్న గాసిప్‌లో ఏ మాత్రం వాస్తవం లేదు. కానీ, ఆయన బీజేపీలోకి వెళ్ళేందుకు అవకాశాలైతే స్పష్టంగా వున్నాయి. కాంగ్రెస్సే నయ్యం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ని పార్లమెంటు సాక్షిగా విభజించింది. బీజేపీ మరీ దారుణంగా, ఆంధ్రప్రదేశ్‌లో నీఛ రాజకీయాలు చేస్తోందని జనం అభిప్రాయపడుతున్నారు.

6 COMMENTS

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు ఖాళీగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేక్షకులను...

కర్ణాటకలో జనసేన జోరు… చిత్రదుర్గలో భారీ చేరికలు

కర్ణాటకలో జనసేన పార్టీ విస్తరణకు నాంది పలుకుతూ చిత్రదుర్గ జిల్లాలో భారీగా చేరికలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత Pawan Kalyan ఆదేశాల మేరకు పార్టీ నాయకత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కర్ణాటకలో...

భన్సాలీ తదుపరి చిత్రంలో ధనుష్… మెగా ప్రాజెక్ట్‌కు కొత్త హీరో!

ప్రముఖ దర్శకుడు Sanjay Leela Bhansali తదుపరి భారీ ప్రాజెక్ట్‌కు హీరోగా Dhanush పేరు ఖరారైనట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. లవ్ అండ్ వార్ తర్వాత ఆయన తెరకెక్కించనున్న ఈ చిత్రం...

మంగ్లీ కేసులో మలుపు.. అరెస్ట్ ముంగిటేనా?

గాయని మంగ్లీకి సంబంధించిన మైక్రోఫైనాన్స్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా పోలీసులు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చినట్లు...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...