Switch to English

సినిమా రివ్యూ : మల్లేశం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,926FansLike
57,764FollowersFollow

నటీనటులు : ప్రియదర్శి , అనన్య, ఝాన్సీ తదితరులు ..
రేటింగ్ : 2. 5 / 5
నిర్మాత, దర్శకత్వం : రాజ్ ఆర్
సంగీతం : మార్క్ కె రాబిన్
కెమెరా : బాలు. ఎస్
ఎడిటింగ్ : రాఘవేందర్

నేత కార్మికుల కష్ఠాలు తగ్గించాలని అషు యంత్రాన్ని కనుగొని .. అందరి దృష్టిని ఆకర్షించాడు మల్లేశం. అయన ప్రభిభకు మెచ్చి పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం. ఎంతో మందికి స్ఫూర్తి కలిగించేలా మల్లేశం జీవితం సాగడంతో అతని కథపై ఆసక్తి పెంచుకున్న దర్శకుడు ఆర్ రాజ్ మల్లేశం జీవిత కథతో సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు. దాంతో మల్లేశంను కలుసుకుని అయన జీవిత విశేషాలను తెలుసుకుని మల్లేశం పేరుతోనే సినిమాగా తెరకెక్కించాడు. చింతకింది మల్లేశం బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మల్లేశం పాత్రలో కమెడియన్ ప్రియదర్శి నటించాడు. మరి మల్లేశం ఎవరు .. అతని కథ ఏమిటి ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

మల్లేశం.. ( ప్రియదర్శి ) నేత కార్మికుల కుటుంబంలో పుట్టిన యువకుడు. అతని తాతముత్తాల కాలమునుండి నేత పనినే ఆధారం చేసుకుని జీవితం గడుపుతుంటారు. అయితే ఆ నేత పనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎన్నో కష్ఠాలు పడుతూ ఉంటారు. నేత పనివల్ల చేలా మంది అనారోగ్యం పాలవుతారు. తన తల్లి ( ఝాన్సీ ) పడుతున్న కష్టాన్ని చూసి తన తల్లిలా ఇంకెవరు కష్టపడకూడదని ఆశు యంత్రాన్ని కనుగొనాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆ ప్రయత్నాల్లో మల్లేశం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటాడు. ఆ క్రమంలో తన తండ్రి తో పాటు ఊరందరిచే ఎగతాళి చేయబడతాడు. అయినా పట్టు వదలకుండా ఆ ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మల్లేశం ఆ యంత్రాన్ని తయారు చేశాడా లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

చేనేత కార్మికులు పడుతున్న సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. చేనేత పనివాళ్ళ కష్ఠాలు .. వాళ్ళ జీవితాలు ఇలా ప్రతి విషయాన్నీ దగ్గరగా చూపించే ప్రయత్నం చేసాడు. 90 కాలం నాటి కథతో సాగె ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. నిజంగా మల్లేశం గానే కనిపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు .. ఇది సినిమా అన్న భావన మర్చిపోయేలా ఉంటుంది. నిజంగా ఆ పరిసరాల్లో మనం తిరుగుతున్నామా అన్న భావన కలుగుతుంది. ప్రియదర్శి విషయంలో ఎలాంటి సందేహాలు లేవు .. తన పాత్రను చక్కగా పోషించి మంచి మార్కులు కొట్టేసాడు. ముఖ్యంగా అతని మాటల్లో చేతల్లో నేటివిటీ బాగా కనిపిస్తుంది. ఇక నటిగా ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఝాన్సీ తల్లి పాత్రలో మరోసారి ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ అనన్య కూడా ఉన్నంతలో చక్కగా చేసింది. ఇమా మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కష్టాలు , కడగళ్ళను వారి హావభావాల్లో వ్యక్తపరిచేలా నటించి ఆకట్టుకున్నారు.

టెక్నీకల్ హైలెట్స్ :

మల్లేశం సినిమా విషయంలో మొత్తం క్రెడిట్ దర్శకుడీకే ఇవ్వాలి. నిజంగా ఇది సాధారణ కథ .. ఏమాత్రం అటు ఇటు అయినా అది డాక్యూమెంటరీ గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దర్శకుడు ఆ విషయంలో చాలా కేర్ తీసుకుని దీనికి సినిమాటిక్ హంగులు అద్దాడు. చేనేత కార్మికుల సమస్యలను కళ్ళకు కట్టినట్టు చూపించి సక్సెస్ అయ్యాడు. సున్నితమైన ప్రేమకథ, భావోద్వేగాలు చక్కగా మిక్స్ చేసాడు. ఇక ఈ సినిమాకు మార్క్ రాబిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. కథలోని మూడ్ ని చేరువ చేసేలా ఉంది. అలాగే కెమెరా వర్క్ సూపర్, ఇక ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కొన్ని బోర్ కొట్టే సన్నివేశాల నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ముఖ్యంగా మల్లేశం అనే ఓ సాధారణ వ్యక్తి కథని ఎంచుకున్న దర్శకుడు దాన్ని మొదలు పెట్టె విషయంలో కానీ ఆ పాత్రను నడిపించే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. కేవలం పాత్రలను మాత్రమే పట్టుకున్న దర్శకుడు కథ, కథనం విషయంలో సరైన ఫాలోయింగ్ చేయలేదు. దాంతో కథ మొత్తం చాలా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇక చైల్డ్ ఎపిసోడ్స్ విషయంలో మరోసారి ఆలోచిస్తే బాగుండేదేమో. సినిమా ట్రీట్మెంట్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ఆకట్టుకోదు. కొత్త నటీనటులు వారి వారి పాత్రల్లో బాగానే చేసిన కథనం విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాడు దర్శకుడు. దానికి తోడు సినిమాకు కావలసిన కమర్షియల్ అంశాలు ఏమాత్రం లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. ప్రియదర్శి, ఝాన్సీ, అనన్య ల నటన .. మ్యూజిక్, కెమెరా విషయాలు మెచ్చుకోవచ్చు. పద్మశ్రీ మల్లేశం జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చేనేత కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపిన దర్శకుడు కథ, కథనం విషయాలపై ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

టాగ్ లైన్ : మల్లేశం .. ఆకట్టుకుంటాడు.

5 COMMENTS

సినిమా

ప్రేమలోకంలో ఆ హీరో.. ఈ హీరోయిన్..!

ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ గా నటించిన ఎంతోమంది ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ రిలేషన్ షిప్ ని కొనసాగించిన వారు ఉన్నారు. ఐతే...

ప్రభాస్ ఛత్రపతి.. విజయ్ దేవరకొండ కింగ్ డమ్..!

విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కింగ్ డమ్ అనే టైటిల్ లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న...

కన్నప్ప కోసం ఆయన కూడా ఏమి తీసుకోలేదా..?

మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్,...

తెరపైకి మల్ల యోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్.. అల్లు అరవింద్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయన జీవిత చరిత్రను వెబ్ సిరీస్ గా కానీ...

నన్ను తొక్కేయడం ఎవరివల్లా కాదు… మంచు మనోజ్

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాయచోటి లో జరిగిన "జగన్నాథ్" అనే సినిమా ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న...

రాజకీయం

మాజీ మంత్రి రోజాకు చెక్ పెడుతున్న వైసీపీ

తిరుపతి జిల్లాలోని నగరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆయన ఏ...

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

ఎట్టకేలకు ’జిత్తులమారి‘ వల్లభనేని వంశీ అరెస్ట్.!

వైసీపీ హయాంలో అయితే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడా పెడా అరెస్టులు చేసెయ్యడం చూశాం. ఈ క్రమంలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తరచూ కోర్టు నుంచి మొట్టికాయలు పడుతుండేవి. అరెస్టులు చేయడం, కస్టోడియల్ టార్చర్...

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు!

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం మై హోమ్ భుజా లో ఆయనని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

ఎక్కువ చదివినవి

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకారం..!

ఏపీ అభివృద్ధికి తైవాన్ సహకరించేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్, ఫుట్ వేర్ రంగాల అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ తైవాన్ సహకారం కోరారు. ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్...

Thandel: బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. ఆర్టీసీ చైర్మన్ ఆగ్రహం

Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. పైరసీ సినిమాను ఇరకాటంలో పడేస్తోంది. సినిమా రిలీజైన రెండో రోజునే హెచ్ డీ ప్రింట్ లింక్ సోషల్ మీడియాలో...

నన్ను తొక్కేయడం ఎవరివల్లా కాదు… మంచు మనోజ్

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాయచోటి లో జరిగిన "జగన్నాథ్" అనే సినిమా ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు....

ఇన్ సైడ్ స్టోరీ: చిరంజీవిని వివాదాల్లోకి లాగితే ఏమొస్తుంది.?

ఆయన మెగాస్టార్ చిరంజీవి.. ఆయన పద్మ భూషణుడు చిరంజీవి.. ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి.! కొణిదెల శివ శంకర వరప్రసాద్ అసలు పేరు.! వెండితెరపై చిరంజీవిలా నాలుగు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నారాయన.! సక్సెస్,...

తండేల్ HD ప్రింట్ లీక్..!?

అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు...