Anand Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ విదేశాల్లో ఉద్యోగ్యంను వదిలి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. హీరోగా మెల్ల మెల్లగా గుర్తింపు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్న ఆనంద్ దేవరకొండ కి బేబీ రూపంలో భారీ విజయం దక్కింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనంద్ దేవరకొండ తన రియల్ బ్రేకప్ గురించి చెప్పి అందరిని సర్‌ప్రైజ్ చేశాడు. బేబీ సినిమాలో హీరోను ప్రియురాలు ఎలా అయితే మోసం చేసిందో అటు ఇటుగా తాను అలాగే మోసపోయాను అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.
ఒక అమ్మాయిని ప్రేమించాను. తాను ఉన్నత చదువుల కోసం షికాగో వెళ్లింది. నేను కూడా పట్టుబట్టి షికాగో వెళ్లాను. అక్కడ బెస్ట్ యూనివర్శిటీలో సీటు దక్కించుకున్నాను. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెతో లైఫ్ చాలా బాగుంటుందని అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత నా గుండె పగిలినంత పనైందని ఆనంద్ దేవరకొండ అన్నాడు. బ్రేకప్ వెనుక స్టోరీ ఏంటి అనేది ఆనంద్ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఆనంద్ దేవరకొండ బ్రేకప్ ఎదుర్కొన్నాడు.