Sai Pallavi : ఫిదా సినిమాతో హైబ్రిడ్ పిల్లా అనిపించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు తెలుగు లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. గత ఏడాది పూర్తిగా ఖాళీగానే ఉన్న సాయి పల్లవి మళ్లీ బిజీ అయ్యింది. నాగ చైతన్య తో కలిసి ఈ అమ్మడు ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
మత్స్యకారుడి ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా ను బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య కు జోడీగా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు ఏ పాత్ర చేసినా కూడా పూర్తిగా లీనం అయ్యి, ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసే విధంగా నటిస్తుంది అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు తండేల్ సినిమా కోసం సాయి పల్లవి ఉత్తరాంధ్ర యాసను నేర్చుకుంటూ ఉందట. బుజ్జి తల్లి అనే పల్లెటూరు అమ్మాయి పాత్రలో సాయి పల్లవి కనిపించబోతుంది. సాయి పల్లవి తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉంటుంది. తండేల్ సినిమా కోసం కూడా తానే డబ్బింగ్ చేయాలని ఉత్తరాంధ్ర యాస పై పట్టు కోసం ప్రయత్నిస్తోందట.