Switch to English

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఫస్ట్ సింగిల్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,961FansLike
57,764FollowersFollow

సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా జనవరిలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘గుమ్మా..’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా

సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ – గుమ్మా సాంగ్ నాకు సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. దర్శకుడు దుశ్యంత్ ఆలోచనల మేరకు పాట చేశాం. ఈ సినిమాలో ఫ్రెష్ సబ్జెక్ట్ చూస్తారు. జెన్యూన్ లవ్ స్టోరి ఉంటుంది. డ్రామా, ఇంటెన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటుడు జగదీశ్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాలో డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా కోసం టీమ్ వర్క్ గా పనిచేశాం. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది. అన్నారు.

నటుడు నితిన్ మాట్లాడుతూ- ఈ సినిమా టైమ్ లో జగదీశ్ మంచి ఫ్రెండ్ అయ్యారు. మేము సీన్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకునేవాళ్లం. సుహాస్ మాకు చాలా సపోర్ట్ చేశాడు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. అన్నారు.

కొరియోగ్రాఫర్ మోయిన్ మాట్లాడుతూ – గుమ్మా సాంగ్ ను డైరెక్టర్ దుశ్యంత్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయించారు. సుహాస్ వల్లే ఇన్ని వేరియేషన్స్ ఉన్న స్టెప్స్ ఇవ్వగలిగాను. పాట టైమ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ – గుమ్మా సాంగ్ వినగానే అందరికీ నచ్చుతుంది. ఈ పాటకు రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. శేఖర్ చంద్ర క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. గుమ్మా సాంగ్ ఒక్కటే కాదు ఈ సినిమాలోని ఆల్బమ్ మొత్తం బాగుంటుంది. ఈ సినిమా మేకింగ్ లో సపోర్ట్ ఇచ్చిన బన్నీవాసు, ధీరజ్ గారికి, వెంకటేష్ మహాకు థ్యాంక్స్. కలర్ ఫొటో మూవీకి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా చూశాక “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” వరల్డ్ లోకి వెళ్తారు. నేను రియల్ లైఫ్ లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా తప్పకుండా కొత్తగా ఉంటుంది. ఫ్రెష్ సబ్జెక్ట్ ఇది. ఆడియెన్స్ ఈ మూవీ థియేటర్ నుంచి ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన మూవీ ఇది. మంచి కథతో పాటు నా పర్ ఫార్మెన్స్ కు కూడా పేరొస్తుందని ఆశిస్తున్నా. సినిమా మీద నమ్మకంతో నేనే కాదు మా టీమ్ అంతా ఇన్వాల్వ్ అయి కష్టపడి పనిచేశాం. హీరోగా కంటే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. హిట్ 2 లో క్యారెక్టర్ కు సైమా అవార్డ్ వచ్చింది. హీరోగానే కాదు మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరు తెచ్చుకోవాలని ఉంది. మధ్యలో కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చాయి గానీ హీరోగా ఒప్పుకున్న సినిమాలు ఉండటం వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయాను. అన్నారు

నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మా బ్యానర్ నుంచి వస్తున్న మరో గుడ్ మూవీ. సినిమా ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మూవీని జనవరి ఎండ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అప్పటికి సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోతాయి. సినిమా బాగుంటే ఎప్పుడైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే జనవరిలో రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ నవంబర్ అనుకుంటే ఎలక్షన్స్ వచ్చాయి, డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం కానీ.. సలార్ రిలీజ్ డేట్ ప్రకటన తర్వాత అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఎలా మారిపోయాయో మీరు చూశారు. జనవరి మాకు మంచి టైమ్ అనుకుంటున్నాం. అల్లు అరవింద్ గారు మా సినిమా చూశారు. చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. అన్నారు

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మంచి మూవీస్ ఎప్పుడొచ్చినా మనం చూస్తాం. సినిమా లవర్స్ కేవలం పెద్ద సినిమాలే చూడాలని అనుకోరు. వాటితో పాటు మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న సినిమాలనూ చూస్తారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా. జనవరిలో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ – హీరోయిన్ గా నా ఎంట్రీకి ఇది పర్పెక్ట్ మూవీ అనుకుంటున్నాను. పర్ ఫార్మెన్స్ కు అవకాశమున్న మంచి రోల్ నాకు దొరికింది. సుహాస్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” హీరోయిన్ గా నాకు మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అని చెప్పింది.

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

ఎక్కువ చదివినవి

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్ కు జైనబ్ రవ్జీల ఎంగేజ్ మెంట్...

Daku Maharaj: తల్లిదండ్రులు, కళామతల్లి ఆశీర్వాదమే డాకు మహరాజ్ సక్సెస్: బాలకృష్ణ

Daku Maharaj: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సూపర్ హిట్టయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం విజయోత్సవ సభ నిర్వహించింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన కార్యక్రమంలో...

కూటమి విజయం: విశాఖ స్టీల్ ప్లాంట్‌కి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ.!

విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం శుభవార్త చెప్పింది. గతంలో విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టిన కేంద్రమే, ఇప్పుడు అదే విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు నడుం బిగించడం గమనార్హం. అప్పుడూ నరేంద్ర మోడీ...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...