స్వప్నా సురేష్ గురించి తెలుసు కదా? ఏడో తరగతి చదివి ఏకంగా కేరళ సర్కారు సంస్థలోనే జాబ్ కొట్టేసిన మహా తెలివైన మహిళ. రాజమార్గంలో బంగారం అక్రమంగా రవాణా చేస్తూ కేరళ సీఎం విజయన్ నే ఇబ్బందుల్లోకి నెట్టిన గడుసైన అతివ. అయితే, ఈ విషయంలో ఆసక్తికరమైన విషయం బయట పడింది. ఈ మొత్తం కుంభకోణం బయట పడటానికి కారణం ఎవరో తెలుసా? హీరోయిన్ పూర్ణ.
ఈటీవీ ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ తెలుసు కదా? తమిళ, మలయాళం సినిమాల్లో ఎక్కువగా చేస్తుంటుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలున్నాయ్. అయితే, ఢీ షోలో జడ్జిగానే పూర్ణకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఈమె వార్తల్లో నిలిచింది. కరోనా కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఆమె తన సొంత రాష్ట్రం కేరళలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెను కొందరు పోకిరీలు వేధించారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజెస్ పెడుతూ డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అయితే, దర్యాప్తు సందర్భంగా ఆ నిందితులు కాస్త ఎక్స్ ట్రాలు చేసినట్టు సమాచారం. తమకు కేరళ సీఎంవోలో అత్యంత పలుకుబడి కలిగిన మహిళ అండదండలు ఉన్నాయని.. మాతో పెట్టుకోవద్దంటూ పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో పోలీసులు నాలుగు తగిలించి కాస్త లోతుగా దర్యాప్తు చేయడంతో త్రివేండ్రంలోని యూఏఈ కాన్సులేట్ కేంద్రంగా జరుగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ కథ వెలుగులోకి వచ్చింది.
అయితే, ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో పోలీసులు అన్నీ ధ్రువీకరించుకున్న తర్వాత కాన్సులేట్ కు వచ్చే పార్శిళ్లపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ పార్శిల్ ను విప్పి చూడగా.. బంగారం బయటపడింది. ఈ అక్రమ రవాణా మూలాలు కేరళ సీఎంవోలో తేలడంతో సంచలనంగా మారింది.
విపక్షాలు సీఎం విజయన్ పై విమర్శలు ఎక్కుపెట్టాయి. దీంతో స్వప్నా సురేష్, ఆమె మాజీ కొలీగ్ సారిత్ కుమార్.. స్వప్నకు సహకరిస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్ వంటి లింకులన్నీ తేలాయి. ఇలా ఈ కుంభకోణం బయటకు రావడానికి మూలకారణం పూర్ణే కావడం విశేషం. ఆమె ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు బంగారం అక్రమ రవాణా కుంభకోణాన్ని ఛేదించారు. ప్రస్తుతం స్వప్నా సురేష్ ఇంకా పరారీలోనే ఉంది.
114434 867256I believe you did an awesome job explaining it. Sure beats having to research it on my own. Thanks 907699
462656 413947A domain name is an identification label which defines a realm of administrative autonomy, authority, or control within the Internet. Domain names are also critica for domain hostingwebsite hosting 62474