దానికోసం జైలుకు వెళ్ళబోతున్న నితిన్..!!

ఫుల్ స్వింగ్ లో .. నితిన్

యంగ్ హీరో నితిన్ కు అ ఆ సినిమా తరువాత సరైన హిట్ లేదు. హిట్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం భీష్మ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 21 న రిలీజ్ కాబోతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తో పాటుగా రంగ్ దే సినిమా చేస్తున్నారు. సమ్మర్ లో సినిమా రిలీజ్ కాబోతున్నది.

భీష్మా, రంగ్ దే సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్ లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంటే… చంద్రశేఖర్ ఏలేటితో నితిన్ చేయబోతున్న సినిమా మాత్రం వీటికి భిన్నంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పూర్తిగా జైల్లో ఖైదీల మధ్య తీయబోతున్నారట. ఇందులో నితిన్ ఖైదీగా కనిపించబోతున్నారనే తెలుస్తోంది. హాలీవుడ్ లో ది షాశాంక్ ప్రిడిక్షన్ అనే సినిమా పూర్తి స్థాయిలో జైల్లో తీసిన సినిమా.

ఈ సినిమా ఇప్పటికి హాలీవుడ్ సినిమాల్లో టాప్ గా ఉన్నది. ఇటువంటి సినిమాలు తెలుగులో రాలేదు. జైలు బ్యాక్ డ్రాప్ స్టోరీలతో కూడిన సినిమాలు వచ్చాయి కానీ, పూర్తి స్థాయిలో ఇలాంటి కథలతో సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. కాగా, ఇప్పుడు ఆ లోటును నితిన్ భర్తీ చేయబోతున్నారు. చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సినిమాలో ఇన్నోవేటివ్ ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా ఇలాంటివే ఉండొచ్చు. భవ్య క్రియేషన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తారట.