యంగ్ హీరోయిన్లు మాత్రమే ఐటమ్ సాంగులు చేయాలా?

అనుష్క ఛాన్స్ కొట్టేసిన .. శ్రియ..!

యంగ్ హీరోయిన్లు మాత్రమే ఐటమ్ సాంగులు చేయాలా? నా వయసు హీరోయిన్లు, పెళ్లైన హీరోయిన్లు చేయకూడదా? అని శ్రియ శరణ్ అంటోంది. వయసు పెరుగుతున్నప్పటికీ శ్రియ అందంలో అంతగా మార్పులు ఏమీ చోటు చేసుకోలేదు. యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో పర్‌ఫెక్ట్‌గా ఫిజిక్ మైంటైన్ చేస్తోంది. పెళ్లి తర్వాత గ్లామర్ షోకి వెనుకాడడం లేదు. అలాగే, ఐటమ్ సాంగులు చేయడానికి సై అంటోంది.

పవన్ కల్యాణ్ ‘కొమరం పులి’ సినిమాలో శ్రియ ఐటమ్ సాంగ్ చేసింది. అంతకు ముందు ప్రభాస్ ‘మున్నా’లోనూ, తర్వాత వెంకటేష్ ‘తులసి’లో కూడా ఐటమ్ సాంగులు చేసింది. మధ్యలో కొన్ని అతిథి పాత్రలు కూడా చేసింది. ఒకానొక టైమ్ లో క్రేజ్ తగ్గినప్పుడు చిన్న హీరోల పక్కన కూడా సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి ఐటమ్ సాంగులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

“హిందీలో కరీనా కపూర్, మలైకా అరోరా ఖాన్ లను చూడండి. పెళ్లి తర్వాత స్పెషల్ సాంగులు చేస్తున్నారు. నేను చేయడానికి ఏముంది?” అని శ్రియ చెబుతోంది. ఇప్పుడు ఆమెకు స్పెషల్ సాంగులు చేసే ఛాన్సులు ఎవరు ఇస్తారో చూడాలి. శ్రియతో ఇప్పుడు సినిమా చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అయింది. ఖాళీ దొరికితే భర్తతో కలిసి బార్సిలోనాలో ఉంటోంది. అక్కడ నుండి టికెట్స్ వేయాలి మరి.