జాతిరత్నాలు సినిమాతో స్టార్ హీరోగా యూత్ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
నవీన్ పొలిశెట్టి గత కొన్ని రోజులుగా అమెరికాలో ఉన్నాడు. ఆయన అక్కడ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. బైక్ మీద నుంచి కింద పడ్డ నవీన్ పొలిశెట్టి చేతికి ఫ్యాక్చర్ అయ్యిందట. వెంటనే ఆసుపత్రికి తరలించగా రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అంటూ వైద్యులు సూచించారట.
గత కొన్ని రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్న నవీన్ పొలిశెట్టి వ్యక్తిగత ట్రిప్ లో భాగంగానే అమెరికాకి వెళ్లాడు. అక్కడ సరదాగా బైక్ పై రైడ్ కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటి వరకు నవీన్ పొలిశెట్టి సన్నిహితుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.