Switch to English

పథకాలు వద్దు.. పాఠశాల ముద్దు: ఓ విద్యార్థి చైతన్యమిదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

అమ్మ ఒడి, జగనన్న కానుక.. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమ పబ్లిసిటీ స్టంట్లలో ఇవి కాస్త ప్రత్యేకమైనవి. తమ ప్రభుత్వం విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని వైసీపీ చాలా ఘనంగా చెప్పుకుంటోంది. ‘నాడు నేడు’ అంటూ స్కూళ్ళను సరికొత్తగా తీర్చిదిద్దేందుకూ ప్రయత్నిస్తోంది.

మంచిదే.. విద్య విషయంలో ప్రభుత్వం ఎలాంటి మంచి ఆలోచనలు చేసినా అభినందించి తీరాల్సిందే. మంచి విద్య.. రేపటి అందమైన భవిష్యత్తుకు దారి చూపెడుతుంది. కానీ, ఎయిడెడ్ స్కూళ్ళపై ప్రభుత్వ వ్యూహాలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నవైనంపై ఎవ్వరూ పెదవి విప్పరేం.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఎయిడెడ్ స్కూళ్ళు మూతబడుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఉత్త ప్రచారమే కాదు, ‘ప్రభుత్వం తీరు కారణంగా స్కూళ్ళను మూసేయడం తప్ప వేరే దారి లేదు..’ అంటూ ఆయా స్కూళ్ళ నిర్వాహకులకు విద్యార్థులకు తేల్చి చెబుతున్నారు.

తాజాగా, విశాఖ జిల్లాలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, ‘మాకు జగనన్న కానుక వద్దు.. మాకు అమ్మ ఒడి వద్దు.. మాకు స్కూల్ కావాలి..’ అంటూ నినదించడం గమనార్హం.

మామూలుగా అయితే, సంక్షేమ పథకాలు వద్దని ప్రజలెవరూ నినదించే పరిస్థితి వుండదు. ఎందుకంటే, ఎవరు అధికారంలో వుంటే వారు.. తమ పేర్లతో ఆయా పథకాలకు సొంత ప్రచారం చేసుకుంటున్నా, ఆయా సంక్షేమ పథకాలు అమలయ్యేది ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే నిధులతోనే. అంటే, అది ప్రజాధనం.

వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి, జగనన్న కానుక.. అంటోంది. ప్రతి యేడాదీ ఈ మేరకు విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు కూడా చేస్తోంది. బెల్టు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం.. ఇలా అన్నిటి మీదా తమదైన ‘ముద్ర’ వుండేలా చూసుకుంటోంది వైసీపీ సర్కారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచే వ్యతిరేకత మొదలైందంటే, అది ఆషామాషీ వ్యవహారం కాదు. అందునా ఓ విద్యార్థి, స్కూలు కోసం జరిగిన ఆందోళన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ విద్యార్థికి జనసేన ముసుగు వేసేందుకు వైసీపీ మద్దతుదారులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏదిఏమైనా, సంక్షేమం మాటున ‘రాజకీయం’ ప్రజలకు అర్థమవుతోందన్నది నిర్వివాదాంశం. ఈ చైతన్యం, అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...