Switch to English

ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనం పిట్టల్లా రాలిపోవడమంటే ఏంటో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో చూశాం. మొదటి వేవ్ విషయానికొస్తే.. అప్పుడూ ప్రాణాలు పోయాయి కరోనా వైరస్ కారణంగా. రెండో వేవ్ మరీ దారుణమైనది. దాదాపుగా దేశంలో ప్రతి ఒక్కరూ తమకు అత్యంత సన్నిహితుల్లోనో, కుటుంబ సభ్యుల్లోనో కనీసం 5 నుంచి 10 మందిని కోల్పోయారు. వీరిలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయినవారే ఎక్కువ.

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక.. ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే.. చాలామంది విగత జీవుల్లా మారిపోయారు. స్మశానాల యెదుట శవాలు క్యూ కట్టడం చూశాం. ఇది కళ్ళ ముందు కనిపించిన వాస్తవం. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవు. దేశమంతా ఇదే పరిస్థితి. కానీ, ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదని కేంద్రం అంటోంది.

ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రానికి, రాష్ట్రాలుగానీ.. కేంద్ర పాలిత ప్రాంతాలుగానీ సమాచారం ఇవ్వలేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా సమాధానమిచ్చింది.. అదీ లిఖిత పూర్వకంగా. ఇంతకీ, అసలు దేశంలో కరోనా వైరస్ వుందని కేంద్రం ఒప్పుకుంటోందా లేదా.? కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని అయినా కేంద్రం అంగీకరిస్తుందా.? లేదా.?

కోవిడ్ వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.. కోట్లాది జీవితాలు రోడ్డున పడిపోయాయి. ఆ లెక్కలేవీ కేంద్రం వద్ద వుండవు. చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకే ఆక్సిజన్ అందని సమస్య వచ్చిపడింది. కేంద్రం ఇప్పుడెలాంటి కథలు చెబుతున్నా, ఆక్సిజన్ కొరత దేశంలో వున్న మాట వాస్తవం. అందుకే, వివిధ దేశాల నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది కేంద్రం. రైలు మార్గం, రోడ్డు మార్గం, జల మార్గం, వాయు మార్గం.. ఇలా అన్ని మార్గాల్లోనూ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.

నో డౌట్, కేంద్రం కష్టపడింది.. రాష్ట్రాలూ కష్టపడాల్సి వచ్చింది. ప్రజలూ ప్రాణాలు కోల్పోయారు. అసలంటూ రాష్ట్రాలు ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వైనంపై కేంద్రానికి ఎందుకు నివేదికలు ఇవ్వలేదు.? తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్యతోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చూశాం. ఇది రాష్ట్రంలో అతి పెద్ద ఘటన. తెలంగాణలోనూ ఆక్సిజన్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవేవీ కేంద్రం లెక్కల్లోకి వెళ్ళలేదంటే తప్పు ఎక్కడ జరిగినట్లు.?

బాధ్యత లేని ప్రభుత్వాలు.. బాధ్యత లేని వ్యవస్థలు.. వెరసి, ప్రజల ప్రాణాల్ని బలిగొన్నాయన్నప్పటికీ, ఆ బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకునేందుకు పాలకులకు మనసొప్పడంలేదు. మొదటి వేవ్ తీవ్రంగా వున్న సమయంలో లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించి.. దేశంలో రెండో వేవ్ తీవ్రంగా రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. దేశంలో చోటు చేసుకున్న ప్రతి కరోనా మరణానికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నైతిక బాధ్యత వహించాలి.

ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదా.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...