Switch to English

ఏపీలో వ్యాక్సినేషన్ రికార్డు.. పండగ చేసుకోండిక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చేసింది. దాదాపు లక్ష టెస్టులు జరుగుతోంటే, కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసులు వెయ్యి నుంచి 1500 లోపు మాత్రమే. అదే ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే, ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 5 వేలకు పైనే.

తెలంగాణతో పోల్చితే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రోజువారీ కరోనా టెస్టుల సంఖ్య కాస్త తక్కువగానే కనిపిస్తోంది గత కొంతకాలంగా. ఇక, తెలంగాణలో కరోనా కారణంగా సంభవిస్తున్న రోజువారీ మరణాలు 10కి అటూ ఇటూగా వుంటోంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో 50కి పైనే నమోదవుతున్నాయి. ఈ భయపెట్టే గణాంకాల్ని ప్రభుత్వం ఏమార్చుతోంది.

గతంలో చేసిన అత్యధిక టెస్టుల సంఖ్య గురించి చెప్పుకోవడం.. తాజాగా ఒకే రోజు పదమూడున్నర లక్షల వ్యాక్సిన్ చేసేశామని గొప్పలు చెప్పుకోవడం.. ఇవన్నీ దేనికోసం.?

నిజానికి, వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సమకూర్చుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ లెక్కన ఏ రాష్ట్రమైనా ఒకే రోజులో రికార్డు స్థాయి వ్యాక్సిన్లు వేయగలదు.. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చేసిందేంటి.? అన్న చర్చ జనంలో జరుగుతోంది. నో డౌట్, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. 13 లక్షల వ్యాక్సిన్లు ఒకే రోజు వేయడమంటే మాటలు కాదు. అందుకు అధికార యంత్రాంగం చేసిన సన్నాహాల్ని అభినందించి తీరాలి. మొత్తం వ్యవస్థ పనిచేసిన తీరుని అభినందించాలి.

కానీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి పెద్ద నగరం అనేది లేకుండా.. కరోనా ఎందుకు ఈ స్థాయిలో ప్రబలింది.? మొదటి వేవ్ చూసుకున్నా.. రెండో వేవ్ చూసుకున్నా.. తెలంగాణ కంటే పరిస్థితి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో చాలా దారుణం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అంటే, ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడిలో అత్యంత దారుణంగా విఫలమైనట్టే.

మూడో వేవ్ వచ్చేస్తోంది. వ్యాక్సిన్లు పెద్దయెత్తున అందిస్తున్న దరిమిలా, మూడో వేవ్ ప్రభావం ఏపీ మీద తక్కువ వుంటుందని ఆశించగలమా.? తెలంగాణ కంటే తక్కువ కేసులు ఏపీలో నమోదవుతాయా.? అదే జరిగితే అభినందించాల్సిందే. కానీ, కేవలం పబ్లిసిటీ వచ్చే కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టి, అసలు బాధ్యత విస్మరిస్తే.. అది మంచి పాలన అనిపించుకోదు పాలకులకి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...