Switch to English

7 మామిడికాయలకు 4గురు వ్యక్తులు, 6కుక్కలు కాపలా..! ఎందుకంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సంక్రాంతి వచ్చిందంటే మామిడి పూతని చూసి మురిసిపోతూంటాం. పండగ వెళ్లగానే.. మామిడికాయలు ఎప్పుడొస్తాయా..? అని ఎదురు చూస్తాం. పిందెలు రాగానే తోటల యజమానులు తోటలకు కాపలా పెడతారు. చుట్టూ భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అయితే.. ఏ ఒక్క మామిడి చెట్టుకో కాపలా పెట్టరు. మనమూ ఎప్పుడూ విని ఎరగము. అదికూడా ‘24 గంటలూ ప్రత్యేక కాపలా’ అనే విషయమే మన ఊహకు రాదు. కానీ.. ఇలాంటి విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. కేవలం ఏడంటే ఏడే కాయలు కాసే ఒక మామిడి చెట్టుకు నలుగురు వ్యక్తులు, ఆరు కుక్కలతో భారీ కాపాలా పెట్టాడో తోట యజమాని. ఈమాత్రం కాపుకు ఇంత కాపలా ఎందుకో.. తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన మామిడి తోట యజమాని పరిహార్.. ఇలా ఒక మామిడి చెట్టుకు భారీ రక్షణ ఏర్పాటు చేశాడు. సీజన్ లో కాసే ఏడు కాయల కోసం నలుగురు మనుషులు, ఆరు కుక్కలతో కాపలా పెట్టాడు. మామిడి చెట్టును కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎందుకంటే.. ఈ ఏడు మామిడి పండ్లకు పలికే ధరే ఇందుకు కారణం. ధర ఎంత..? అంటే.. ఒక కేజీ మామిడి పండ్లు 2.70 లక్షలకు అమ్ముడవుతాయి కాబట్టి..! ఆశ్చర్యపోకండి? ఇది నిజమే అంటున్నారు పరిహార్ ఆయన సతీమణి రాణి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి జపాన్ లో ‘మియజాకి’ అనే అరుదైన జాతికి చెందినవి కాదడమే. గతంలో పరిహార్ చెన్నైకి వెళ్తుంటే.. రైలులో ఓ వ్యక్తి ఈ మొక్కను ఇచ్చాడట.

ఈ మొక్క ప్రత్యేకత అప్పటికీ తెలీదంటున్నాడు పరిహార్. మొక్క నాటి.. కాపు వచ్చిన తర్వాత ఓ వ్యాపారి ఒక్క కాయకు 21వేలు ఇస్తానన్నాడట. ముంబైకి చెందిన బంగారం వ్యాపారి అడిగినంత డబ్బు ఇస్తా అన్నాడు.. అయినా మేం ఇవ్వలేదని రాణి అంటున్నారు. మామిడికాయల గురించి తెలియడంతో గతేడాది కాయలు కొందరు దొంగలించారు. దీంతో ఈ ఏడాది భారీ కాపలా పెట్టానని చెప్తున్నాడు పరిహార్. ఈమామిడి కాయలు అమ్మనని.. వీటిని తోటలా పెంచడానికే ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నాడు పరిహార్. అరుదైన జాతి కాయలు కాబట్టే ఇంత ధర అని మధ్యప్రదేశ్ హార్టికల్చర్ విభాగం అధికారులు అంటున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...