Switch to English

వీళ్ళంట.. ప్రజా ప్రతినిథులంట.. ఓటేస్తే పాపమే మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

రాజకీయమంటే సేవ.. అనేది ఒకప్పటి మాట. రాజకీయం అంటే వ్యాపారమిప్పుడు. ఎన్నికల్లో గెలవడానికి ఎంత ఖర్చు చేశాం.? గెలిచాక ఎంత సంపాదించాం.? అన్న ప్రాతిపదికనే రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే, తమ ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా వుండేందుకు రాజకీయ నాయకులు పార్టీ మారడం సర్వసాధారణమైపోయింది.. కాదు కాదు, అదొక జీవన్మరణ సమస్యగా మారిపోయింది రాజకీయ నాయకులకి.

కోడెల శివప్రసాద్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.? అన్న ప్రశ్నకు సరైన కారణం వెతికితే, మొత్తం పరిస్థితిపై స్పష్టత వచ్చేస్తుంది. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎంపీలు కొందరు ఓ చోట సమావేశమై, ‘బరువు తగ్గాలనుకున్నవారు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తామని చెప్పండి..’ అంటూ జోకులేసుకున్న వైనం, వీడియో లీక్ రూపంలో బయటకొచ్చింది. అప్పట్లో ఆ వీడియో పెను దుమారం రేపింది.

ఈ మధ్యనే, ‘ఏప్రిల్ 17 తర్వాత పార్టీ లేదు బొక్కా లేదు..’ అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల వ్యవహారం కూడా లీక్ రూపంలోనే బయటకొచ్చింది. ఇదీ రాజకీయ నాయకులకి, రాజకీయాలపైనా, ప్రజలపైనా వున్న చిత్తశుద్ధి. ఈసారి వైసీపీ నేతల వంతు. వైసీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిథులు (ఎంపీలు) ఓ చోట కూర్చుని ముచ్చటించుకున్నారు. కరోనా విషయంలో తమ ప్రభుత్వం చేతులెత్తేసిన వైనాన్ని ఆ ఎంపీలు ఎంత చక్కగా ముచ్చటించుకున్నారో. ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయాయని సదరు నేతలే ఒప్పుకున్నారు. అందులో వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులున్నారండోయ్. శవ రాజకీయాలు.. అని బహుశా ఇలాంటి రాజకీయాల గురించే చెప్పుకుంటారేమో.

మా ప్రభుత్వం కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గా పనిచేస్తోందంటూ ప్రభుత్వ పెద్దలు ఘనంగా చెప్పుకుంటోంటే, పార్టీ ముఖ్య నేతలేమో ఇదిగో ఇలా తమ ప్రభుత్వ అసమర్థతను చాటేసుకుంటున్నారు. కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాలు చేసేది, ప్రజల్ని ఏమార్చి, వంచించి.. తమ ఆర్థిక మూలాల్ని బలోపేతం చేసుకోడానికి తప్ప, ప్రజల్ని ఉద్ధరించడానికా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

రాజకీయం

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

ఎక్కువ చదివినవి

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...