Switch to English

ప్రక్షాళన దిశగా నడుం బిగించిన కేసీఆర్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

ఈటెల రాజేందర్ మాత్రమేనా.? మంత్రి వర్గం నుంచి ఇంకెవరైనా ఔట్ అవబోతున్నారా.? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనసులో ఏముంది.? ఆయన, ప్రక్షాళన దిశగా చర్యలు షురూ చేసేవారా.? అవి ఈటెల రాజేందర్ తొలగింపుతోనే మొదలయ్యాయా.? ఇలా రకరకాల ప్రశ్నలు గులాబీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈటెల రాజేందర్ తొలగింపు అనేది చిన్న వ్యవహారమేననీ, ముందు ముందు చాలా పెద్ద మార్పులు చూడబోతున్నామనీ గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోందట గత కొద్ది రోజులుగా. ప్రధానంగా ధరణి పోర్టల్ తెరపైకొచ్చాక, చాలామంది నాయకుల్లో గుబులు మొదలయ్యింది.

 

ఈ క్రమంలోనే కొందరు తమ ఆర్థిక మూలాలు దెబ్బ తింటాయన్న కోణంలో ఆందోళన చెందడం మొదలెట్టారట. తాజాగా దేవరయాంజల్ భూముల వ్యవహారం తెరపైకి రావడంతో, మరింతగా గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్నారనీ, ఈ క్రమంలో పలువురు మంత్రులు తమ పదవుల్ని కోల్పోవచ్చనీ అంటున్నారు. కొన్నాళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామరావు పేరుని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపాదించిన నేతల్లోనూ కొందరు తమ పదవుల్ని కోల్పోయే అవకాశం వుందట. అలా కేటీఆర్ మీద లేని పోని ప్రేమ కురిపించినవారికి షాకిస్తూ, ‘అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.? ఇంతటి బాధ్యతారాహిత్యమా.?’ అంటూ కేసీఆర్ అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు.

 

కేటీఆర్ విషయంలో భజన చేసిన నాయకుల లిస్ట్ తీస్తే, అందులో ఈటెల పేరు కూడా కన్పిస్తుంది. సో, వేటు ఆ కోణంలోనే ఈటెల మీద పడిందా.? లిస్టులో తర్వాత వున్నదెవరు.? అన్న చర్చ జరగడం సహజమే మరి. కరోనా నుంచి కోలుకుని తాజాగా ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్, అటు పాలన విషయంలో.. ఇటు పార్టీ విషయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...