Switch to English

ఆది సాయికుమార్ ‘శశి’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow
Movie శశి
Star Cast ఆది, సురభి, రాశి సింగ్
Director శ్రీనివాస్ నాయుడు నదికట్ల
Producer ఆర్. పి. వర్మ , చావలి రామంజనేయులు
Music అరుణ్ చిలేవేరు
Run Time 2 గం 10.ని
Release 19 మార్చి 2021

మొదటి రెండు సినిమాల తర్వాత ఒక సూపర్ హిట్ లేక రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఆది సాయి కుమార్ చేసి మరో ప్రేమ కథా చిత్రం ‘శశి’. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా సాంగ్స్ అండ్ ట్రైలర్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ లానే ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఆదికి కావాల్సిన హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:

రాజు(ఆది సాయి కుమార్) – శశి(శివ) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వాళ్లిద్దరూ చదువుకునే కాలేజీలో శశి(సురభి) చేరుతుంది. తనని చూసిన ఆది ప్రేమలో పడతాడు. శశికి కూడా రాజు అంటే ఇష్టమే కానీ తన ప్రేమను చెప్పకుండా రాజుని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఫైనల్ గా శశి తన ప్రేమని రాజు కి చెబుదాం అనుకునే టైంలో రాజు ఫ్రెండ్ శశికి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం వలన రాజు శశిని కలవలేకపోతాడు. తర్వాత వెళ్లి చూస్తే, శశి ఊరు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో అటు ఫ్రెండ్ చనిపోయి, ఇటు ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోవడంతో రాజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. రెండేళ్ళ తర్వాత అదే ఊర్లో రాజుకి శశి కనపడుతుంది. కానీ శశి రాజుని గుర్తుపట్టాడు. ఇక అక్కడి నుంచీ శశి ఎందుకు రాజుని గుర్తు పట్టడం లేదు? ఎందుకు గతంలో తనకి ఏం చెప్పకుండా ఊరొదిలి వెళ్ళిపోయింది? చివరికి శశి రాజుని గుర్తుపట్టి తన ప్రేమని చెప్పిందా? లేదా అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ఆది సాయికుమార్ ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు. కాలేజ్ కుర్రాడి పాత్రలో సాఫ్ట్ గా లవ్ బాయ్ లాగా కనిపించి ఆకట్టుకున్నాడు. మరోవైపు బాధతో కూడిన రఫ్ అండ్ టఫ్ లుక్ లో అదరగొట్టాడు. గతంలో ఇలాంటి పెయిన్ ఫుల్ పాత్ర చేయకపోవడం వలన ఆది చాలా ఫ్రెష్ గా అనిపించడమే కాకుండా సూపర్బ్ గా పెర్ఫార్మన్స్ కూడా చేసాడు. టైటిల్ రోల్ చేసిన సురభి చూడాటానికి క్యూట్ గా ఉంది. అలాగే రెండు డిఫరెంట్ షేడ్స్ లో మంచి నటనని కనబరిచింది. రాశి సింగ్ కనిపించేది కాసేపే అయినా ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. తులసి ఆది మదర్ పాత్రలో బాగా చేయడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో మెప్పించిందని. అజయ్, జయరాం, రాజీవ్ కనకాల, శివ తదితరులు పాత్రల పరిధిమేర నటించారు.

తెర వెనుక టాలెంట్..

ముందుగా ఈ సినిమాకి క్రేజ్ తెచ్చిన సాంగ్స్ తో మొదలు పెడితే, సాంగ్స్ విజువల్ గా కూడా బాగున్నాయి, అలాగే అరుణ్ చిలువేరు అందించిన నేపధ్య సంగీతం బాగుంది. కనెక్ట్ లేని చోట కూడా తన మ్యూజిక్ తో సేవ్ చేయడానికి ట్రై చేసాడు. అమర్నాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లవ్ స్టోరీ లో కూల్ ఫీల్ ని, రఫ్ అండ్ టఫ్ సీన్స్ లో మాస్ ఫీల్ ని విజువల్స్ లో పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసాడు. సత్య జి ఎడిటింగ్ ఓకే.

ఇక ఈ సినిమాకి కథ – కథనం – దర్శకత్వం వహించిన నూతన దర్శకుడు శ్రీనివాస్ నాయుడు విషయానికి వస్తే, ఈ ప్రేమ కథని మనం చాలా సార్లే చూసాం. అలాగే హీరోయిన్ పాత్రకి రాసుకున్న కాన్ఫ్లిక్ట్ కూడా చాలా రొటీన్ గా ఉంది. సో కథ పరంగా గొప్పగా అనిపించదు. ప్రేమ కథలకి ఫీల్ అండ్ ఎమోషన్ ని కనెక్ట్ చేయడమే బిగ్గెస్ట్ సక్సెస్. కానీ ఇందులో అంత ఫీల్ గుడ్ లవ్ సీన్స్ లేవు అలా అని ఎమోషనల్ గా మనసుకు హత్తుకొని మనల్ని ఫీలయ్యేలా చేసే ఎమోషన్ అయినా అండా అంటే అదీ లేదు. దీనికి తోడు ఎంగేజింగ్ గా లేని కథనానికి స్లో నేరేషన్ తోడవ్వడంతో సినిమా చాలా బోర్ కొట్టేస్తుంది. ఇకపోతే డైరెక్టర్ గా సినిమాలో చాలా పాత్రలను మధ్యలోనే వదిలేసినా ఫీలింగ్ వస్తుంది. అలాగే కథలో కన్వీనెంట్ కోసం పాత్రల్ని చంపేసినట్టు ఉంటుంది. సో డైరెక్టర్ గా అనుకున్న ఫీల్ ని సినిమాలో చూపించలేకపోయారు. రవి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– ఆది పెర్ఫార్మన్స్
– సాంగ్స్ అండ్ మ్యూజిక్
– ఆది అండ్ తులసి మధ్య ఎమోషనల్ సీన్స్
– కొన్ని కాలేజ్ సీన్స్

బోరింగ్ మోమెంట్స్:

– రొటీన్ ప్రేమ కథ
– ఎంగేజింగ్ గా లేని కథనం
– స్లో నేరేషన్
– ఎమోషనల్ ఫీల్ సరిగా వర్క్ అవ్వకపోవడం
– వీక్ క్లైమాక్స్
– నవ్వించలేకపోయిన కామెడీ

విశ్లేషణ:

రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘శశి’లో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమాకి కాస్త హిట్ కల కనపడింది. కానీ సినిమా చూసాక ఎన్నో ప్రేమ కథల్లానే ఇదీ రొటీన్ ప్రేమ కథ అవ్వడం వలన అంచనాలను అందుకోలేక ప్రేక్షకులకు నిరాశని మిగిల్చింది. అలాగే ప్రేమ కథకి కావాల్సిన ఫీల్ గుడ్ టచ్ అండ్ ఎమోషనల్ పెయిన్ కనెక్ట్ కాకపోవడం వలన సినిమాకి కనెక్ట్ అవ్వము. కాస్త హైప్ వచ్చిన శశి సినిమా కూడా ఆది కోరుకున్న హిట్ ఇవ్వలేకపాయింది.

చూడాలా? వద్దా?: ఇంత స్లో లవ్ స్టోరీని చూడటం కష్టమే.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

రాజకీయం

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...