Switch to English

మళ్ళీ అదే పైత్యం: వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పార్టీ పనిచేస్తోందట.. మిత్రపక్షం బీజేపీని కాదని తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి ప్రయాణం సాగిస్తోందట. ఇది వైసీపీ మార్కు దుష్ప్రచారం. వైసీపీ అను‘కుల’ మీడియాలో జనసేన మీద విషం చిమ్ముతూ నిత్యం కథనాలు దర్శనమిస్తూనే వున్నాయి.

జనసేన మీద వేరే రకంగా దుష్ప్రచారం చేయడానికి అవకాశం లేదు గనుక.. మొదటి నుంచీ ఒకటే తరహా ‘పాచిపోయిన’ కథనాల్ని మళ్ళీ మళ్ళీ కొత్తగా వండి వడ్డించేస్తోంది వైసీపీ అనుకూల మీడియా.. అదే పాట పాడుతోంది వైసీపీ.

పంచాయితీ ఎన్నికలు కావొచ్చు, మునిసిపల్, పరిషత్ ఎన్నికలు కావొచ్చు.. ఇలాంటి స్థానిక ఎన్నికల వేళ.. స్థానిక పరిస్థితుల్ని బట్టి ఈక్వేషన్స్ మారుతుంటాయి. టీడీపీ, వైసీపీ జెండాలు కలిసి కనిపిస్తున్నప్పుడు.. టీడీపీ – జనసేన కలిసి కనిపిస్తే తప్పేంటట.? నిజానికి, తెలుగుదేశం పార్టీ విధిలేని పరిస్థితుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతిస్తోంది తప్ప, ఎక్కడా జనసేన పార్టీ, టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడంలేదు.

పవన్ కళ్యాణ్‌కి వున్న సినీ గ్లామర్‌ని అనైతికంగా వాడేసుకుంటోంది టీడీపీ. ఆ మాటకొస్తే, ఈ విషయంలో వైసీపీ తక్కువేమీ తిన్లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీకి చెందిన పలువురు నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, జనసైనికుల్ని వేడుకున్నారు.. తమకు మద్దతివ్వమని. ‘జనసేనతో చర్చలు జరుగుతున్నాయ్..’ అని అప్పట్లో కొందరు వైసీపీ నేతలే చెప్పుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అప్పట్లో ‘ఆ అవకాశమే లేదు’ అని జనసేన ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది కూడా.

జనసేనకు అసలు రాష్ట్రంలో బలమే లేదని వైసీపీ అంటోంది. టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనీ వైసీపీ విమర్శిస్తోంది. బీజేపీని ఏపీలో జనం లెక్కచేయరన్నదీ వైసీపీ మాటే. అలాంటప్పుడు, విపక్షాలు అన్నీ ఒక్కటైతే మాత్రం వైసీపీకి అంత భయమెందుకు.? వాళ్ళందరూ కలిసినా, కలవకపోయినా.. పనిగట్టుకుని వైసీపీ, ‘మధ్యవర్తి’గా వ్యవహరించి.. ఆయా పార్టీల్ని ఒక్కతాటిపైకి తెచ్చేలా వుంది. రాజకీయాల్లో ఇంతలా దిగజారిపోయిన అధికార పార్టీ వైసీపీ తప్ప ఇంకోటి కనిపించదేమో.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...