Switch to English

టిబి స్పెషల్: ఔను, జనసేన పార్టీ బలోపేతమవుతోంది.. ఇదీ వాస్తవం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కొన్ని సర్వేలు తప్పుడు నివేదికల్ని ప్రచారంలోకి తీసుకురావొచ్చు.. జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అస్సలేమాత్రం ప్రభావం చూపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేయొచ్చు. కానీ, 2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ‘ఏవి పాలు, ఏవి నీళ్ళు..’, ‘ఏది చెడు, ఏది మంచి’ అన్న విషయాలపై రాష్ట్ర ప్రజానీకానికి ఓ అవగాహన వచ్చింది.

వైసీపీ – టీడీపీ మధ్య ఆధిపత్య పోరు తప్ప, రెండు పార్టీలకీ రాష్ట్ర అభివృద్ధిపై అస్సలేమాత్రం అవగాహన, విజ్ఞత, బాధ్యత లేవని తేలిపోయింది. ‘మేం ఎన్నికల్లో ప్రజల్ని ప్రలోభపెట్టబోం.. ఎన్ని సీట్లు వస్తాయి.? గెలుస్తామా.? ఓడతామా.? అన్నదే ప్రశ్నే కాదు. మేం, ఎంతమందిని ప్రబావితం చేయగలిగామన్నదే మాకు ముఖ్యం..’ అని చెప్పిన జనసేన మాటల్లో అసలు వాస్తవమేంటో, ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది.

బాధ్యతగల రాజకీయ పార్టీగా జనసేన పార్టీ, గడచిన ఏడాది కాలంలో చాలా విషయాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది.. ప్రజల తరఫున పోరాడుతోంది. ‘ఫక్తు రాజకీయాలకు’ దూరంగా జనసేన రాజకీయాలు నడుస్తుండడంతో, బహుశా రాజకీయ విశ్లేషకులకు కూడా జనసేన అనేది ఓ రాజకీయ పార్టీగా కనిపించి వుండకపోవచ్చు.

‘తెలుగు బులెటిన్‌ డాట్‌ కాం’ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. జనసేన పార్టీని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలా నడిపిస్తున్నారు.? ఎలా బలోపేతం చేస్తున్నారు.? తదుపరి ఎన్నికల్లో జనసేన పాట్ర ఏంటి.? అన్న దిశగా ఓ ఒపీనియన్‌ పోల్‌ని ప్రారంభించింది. ‘పవన్‌ కళ్యాణ్‌, జనసేన పార్టీని బలోపేతం చేసి తదుపరి ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించే దిశగా నడుస్తున్నారని మీరు భావిస్తున్నారా.?’ అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అనే సమాధానం 74 శాతం మంది నుంచి వచ్చింది. ‘కాదు’ అన్నవారు 26 శాతం మంది.

అయితే, జనసేన పార్టీ, జనంలోకి వెళ్ళేందుకు ఇంకా చాలా కష్టపడాల్సి వుందన్నది నిర్వివాదాంశం. బీజేపీతో జనసేన మైత్రి విషయంలో కొంత గందరగోళం గ్రౌండ్‌ లెవల్‌లో కనిపిస్తోంది. చాలా అంశాల్లో బీజేపీ, జనసేన పార్టీతో కలిసి నడవడంలేదు. కీలకమైన విషయాల్లో జనసేన వాయిస్‌తో బీజేపీ గొంతు కలపలేకపోతోంది. ఆ కారణంగా బీజేపీ పట్ల వున్న నెగెటివిటీ, జనసేన వైపుకూ మళ్ళుతోంది.

ఇంకోపక్క, టీడీపీ – జనసేన కుమ్మక్కు.. అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ‘జనసేన పార్టీ మాకు మిత్రపక్షం లాంటిదే..’ అంటూ టీడీపీ నేతలు కొందరు గ్రౌండ్‌ లెవల్‌లో చేస్తున్న దుష్ప్రచారాల పట్ల జనసేన పార్టీ అప్రమత్తంగా వుండాల్సిందే. అన్నిటికీ మించి, వివిధ అంశాలపై జనసేన తరఫున బలమైన గొంతుకల అవసరం ఎంతైనా వుంది.

ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుందని లైట్‌ తీసుకుంటే కుదరదు. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఏ క్షణాన ఎలాగైనా మారిపోవచ్చు. మరి, జనసేనాని ఆ దిశగా మరింత వేగం పెంచుతారా.? రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోన్న ‘పొలిటికల్‌ వాక్యూం’ జనసేన పార్టీ భర్తీ చేస్తుందా.? వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...