Switch to English

అయ్యో పాపం.. రవిప్రకాష్‌ ఆవేదన విన్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

టీవీ 9 సిఈఓ పదవి నుండి తొలగించబడ్డాక రవిప్రకాష్‌ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో యాజమాన్యం నిర్ణయాల్ని కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. సంస్థలో రాజకీయ జోక్యమే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు. టీవీ 9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసేముందు ఈ అంశాల్ని మీ ముందుంచుతున్నానంటూ, తాను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. స్వతంత్రంగా పని చేసే టీవీ 9 సంస్థలోకి వెనకదారిలో చొరబడ్డారంటూ ప్రస్తుత యాజమాన్యంపై మండి పడ్డారాయన.

రాజకీయ అండదండలతోనే ఇంత పెద్ద కుట్ర నడిపించారన్నది రవిప్రకాష్‌ ఆరోపణ. తప్పుడు ఫిర్యాదులతో, తప్పుడు కేసులతో తనను వేధించేందుకు కొత్త యాజమాన్యం ప్రయత్నిస్తోందనీ ఆరోపించారు. తనతో కలిసి పని చేసిన వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి, భయోత్పాతం కలిగించి సంస్థను స్వాధీనం చేసుకున్నారని నిందలు మోపారు. ఇలాంటి ఆవేదన రవిప్రకాష్‌ నుండి రావడంలో వింతేమీ లేదు. అయితే, ఎంతమంది ఉసురు పోసుకున్నావో నీకు గుర్తు లేదా.? అని సోషల్‌ మీడియా వేదికగా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఆయనకు అదే సోషల్‌ మీడియాలో మద్దతు కూడా పలుకుతున్నారు.

ఇంత జరిగిన తర్వాత కూడా టీవీ 9ని వదిలేది లేదని రవిప్రకాష్‌ తన బహిరంగ లేఖలో ప్రకటించడం గమనార్హం. సాటి షేర్‌ హోల్డర్‌గా సంస్థలో తన వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటానంటూ.. కొత్త డైరెక్టర్‌లకు ఝలక్‌ ఇచ్చారు రవిప్రకాష్‌. హాస్యాస్పదమైన విషయమేంటంటే, దేశంలో జర్నలిజాన్ని కాపాడ్డానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి, మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించడానికి తన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని రవిప్రకాష్‌ ప్రకటించడం.

మీడియా అంటేనే రాజకీయం. రాజకీయం అంటేనే మీడియా అనే స్థాయికి ఈ రోజు మీడియాపై కొందరు సామాన్యులు హేళనగా చర్చించుకుంటున్నారంటే, ఆ పాపంలో సింహ భాగం రవిప్రకాష్‌కే దక్కుతుంది. మెరుగైన సమాజం కోసం కులరహిత సమాజం కోసం.. అంటూ నీతులు చెప్పే టీవీ 9, వాటిని ఆచరించడం ఎప్పుడో మర్చిపోయింది. ఆ బాధ్యత అంత పెద్ద సంస్థకు సిఈఓగా వ్యవహరించిన రవిప్రకాష్‌దేనంటారు మీడియా రంగంలో చాలా మంది.

బహిరంగ లేఖ విడుదల చేయడం ద్వారా చిన్నపాటి ప్రకంపన ఏదో సృష్టిద్దామనుకున్నారు. కానీ అది బూమరాంగ్‌ అయ్యేలానే కనిపిస్తోంది. ఎందుకంటే రవిప్రకాష్‌ అక్రమాలపై ఇప్పటికే టీవీ 9 కొత్త యాజమాన్యం నుండి పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఈ బహిరంగ లేఖ తర్వాత మరిన్ని ఆధారాలతో మరిన్ని ఫిర్యాదులు తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవల్సిన పని లేదు. వాటాదారునిగా ఉంటానంటూ, రవిప్రకాష్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కూడా వాటాదారుల్లో కొంత అసహనం పుట్టించే అవకాశాలు లేకపోలేదు. అలా జరిగితే, శాశ్వతంగా రవిప్రకాష్‌ టీవీ 9కి దూరమవ్వాల్సి వస్తుందేమో.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 26 మే 2024

పంచాంగం తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి నక్షత్రం: మూల...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న న్యూస్

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని సమాచారం. తెలుగు, తమిళ సినిమాల లెజండరీస్...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్ లో బాలకృష్ణ

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని హీరో బాలకృష్ణ (Bala Krishna) అన్నారు....

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

Kamakshi: ‘బోల్డ్ సీన్స్ అయితే ఏంటీ.. నటిస్తా..’ హీరోయిన్ కామెంట్స్ వైరల్

Kamakshi: ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla). అయితే.. విరుపాక్ష, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్, రౌడీ బాయ్స్, ఓం భీం బుష్ సినిమాల్లో నటించినా.. పొలిమేర,...